India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD చందానగర్ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మెదక్ BJP అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులతో పాటు ఆయా మోర్చాల నాయకులు, శక్తి కమిటీలు, బూత్ కమిటీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కారేపల్లి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది. 2, 3 రోజుల్లో సొసైటీ డైరెక్టర్లు ఖమ్మం డిసిఓని కలవడానికి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాగా మండలంలో సొసైటీ డైరెక్టర్లు మొత్తం 13 మంది ఉండగా, పదిమంది డైరెక్టర్లు చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
HYD రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
HYD రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. బుధవారం రాజ్ భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం విషాదకర ఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు కిష్టయ్య, వెంకటేశ్‌గా గుర్తించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 2వ విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా డా.సుమలత పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఫోన్ రాగా ఆమె హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మొదట బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. బీజేపీ గోడం నగేశ్‌కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్‌లో చేరారు.
మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉమ్మడి జిల్లాలో గడచిన ఐదేళ్లలో 2,28,905 మంది ఓటర్లు పెరిగారు. కరీంనగర్ పరిధిలో 1,37,499 ఓటర్లు, పెద్దపల్లి పార్లమెంటు రామగుండం, మంథని, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీలలో 57,287, నిజామాబాద్ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో 34,119 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 2,28,905 మంది ఓటర్లు పెరిగారు.
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో 327 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సింగరేణి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలన్నారు. (ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడబ్ల్యూడీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుందని సింగరేణి అధికారులు తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :04-05-2024 కాగా https://seclmines.com/scclnew/index.asp వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.