India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని అద్దెకు తీసుకున్న బైకులపై తిరిగి వస్తున్న ఇద్దరు HYD యాత్రికులపై కొండ చరియలు విరిగిపడడంతో చనిపోయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన సత్యనారాయణ(50), నిర్మల్ షాహి(36)తోపాటు మరో ఇద్దరు నార్త్ ఇండియా టూర్‌కి వెళ్లారు. ప్రమాదంలో వారి మృతదేహాలు బాగా డామేజ్ కావడం, ఓ వ్యక్తి తల కూడా దొరకకపోవడంతో అక్కడే అంత్యక్రియలు చేశారని తెలిసింది.

ఫొటోగ్రాఫర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్మూరు మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పోలిశెట్టిపల్లి శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండల కేంద్రానికి చెందిన దుడ్డు యాదగిరి(38) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. పొలం యజమాని అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు ఉన్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 3, 2004 – జనవరి 03, 2008 మధ్య జన్మించిన అవివాహిత మహిళా, పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాల కోసం https://agnipathvayu.cdac.inలో సంప్రదించాలని సూచించారు.

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్మల నృత్యనికేతన్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక స్తోత్రం, అన్నమాచార్య కృతి, రామదాసు కృతి, సరస్వతి కీర్తన, తరంగం, పురందరదాసు కీర్తన, జయదేవ అష్టపది, పదం, మంగళ హారతి అంశాల్లో నృత్యం చేశారు. కార్యక్రమంలో హిమశ్రీ, కావ్య, రోషిత, తన్మయి, తన్విత, కీర్తియుక, శ్రీనిధి, సంజన ఉన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవి కిరణ్, ఆయన కుమారుడు మైకేల్ ఇమ్మానుయేల్ ఇద్దరూ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. రవి కిరణ్ కామేపల్లిలోని ఎంజేపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడంతో యువతకు మార్గదర్శకుడిగా నిలిచారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి, దివంగత డీ. శ్రీనివాస్ స్మృతి సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండ: అరుణాచల గిరి దేవస్థాన దర్శనానికి వెళ్లే భక్తులకి వరంగల్ వన్ డిపో నుంచి స్పెషల్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 19న ఒక బస్సు బయలుదేరుతుందని, జులై 21న మధ్యాహ్నం మరో బస్సు బయలుదేరుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. మరిన్ని వివరాల కోసం 98663 73825 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన కోయిలకొండ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. బూరుగుపల్లికి చెందిన గొల్ల మోగులయ్య, లక్ష్మయ్య గ్రామం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా పారుపల్లి వద్ద RTC బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో RTC బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.