India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కాజిగిరి సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సిట్టింగ్ స్థానం కావడం, మరోవైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. సునీతారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని సూచించారు. కాగా BRS నుంచి రాగిడి, BJP నుంచి ఈటల పోటీ చేస్తున్నారు.

సత్తుపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ చాంద్ పాషాపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. సంఘటనను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం చాంద్ పాషాకు ఫోన్ చేసి పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడి చేసిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై వారు చర్చించారు. ఈనెల 29న సా.5 గంటలకు HYD గాంధీభవన్‌లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

HYD ఉప్పల్‌లో JV బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ దంపతులు ఎండీ లక్ష్మీనారాయణ, జ్యోతి కలిసి అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి పెట్టుబడుల పేరిట ఇన్వెస్టర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.500 కోట్లు మోసం చేశారంటూ బాధిత ఇన్వెస్టర్లు PSలో ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎల్బీనగర్‌లోని RR జిల్లా కోర్టు మెట్లెక్కామని తెలిపారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకొని, న్యాయం చేయాలని కోరారు.

మాజీ సీఎం KCR సన్నిహితుడు, నర్సాపూర్ మాజీ MLA మదన్ రెడ్డి BRS పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తారని ఇవ్వకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. కాంగ్రెస్ నేత, మాజీ MLA మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని టాక్. కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే చేరుతా అన్నారని సమాచారం.
✓ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
✓ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✓ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✓ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.
స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.38 కోట్ల వ్యయం (ప్యాకేజ్-1)తో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా మార్చే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. మరోవైపు ‘ప్రసాద్’ పథకం కింద రూ.4.05 కోట్ల వ్యయంతో HYD బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి, పక్కనే ఉన్న పాత భవనాన్ని కూల్చి 3 అంతస్తుల కొత్త భవనం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.