India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దని, CM రేవంత్ సానుకూలంగా ఉన్నారని TPCC అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. బీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా ప్రిపరేషన్‌కు సిద్ధం కావాలని చనగాని దయాకర్ సూచించారు. DSC పరీక్ష వాయిదా ఉండదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని వెల్లడించారు.

గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దని, CM రేవంత్ సానుకూలంగా ఉన్నారని TPCC అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. బీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా ప్రిపరేషన్‌కు సిద్ధం కావాలని చనగాని దయాకర్ సూచించారు. DSC పరీక్ష వాయిదా ఉండదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని వెల్లడించారు.

బిచ్కుందలోని ATM మెషిన్‌ను దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరికి వినియోగించిన వాహనం మహారాష్ట్ర సరిహద్దులో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్‌కు చేరుకొని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతూ మార్గమధ్యలో పెద్ద ఏడ్గిలో 2 బైక్‌లను సైతం చోరీ చేశారనీ SI సత్యనారాయణ తెలిపారు.

వాజేడు బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులు జలపాతం నీటిలోకి దిగొద్దని వెంకటాపురం సీఐ బండారి కుమార్ తెలిపారు. బొగత జలపాతాన్ని వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌తో కలిసి పరిశీలించారు. వరద ప్రవాహం పరిస్థితి, సందర్శకుల తాకిడి గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులు ఎవరూ లోపలికి వెళ్లవద్దని, వీక్షకులను లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూడాలని అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బందికి సూచించారు.

కల్వకుర్తి పట్టణానికి చెందిన రైతు వసంత యాదయ్య(48) మంగళవారం పాముకాటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన యాదయ్య రోజు మాదిరిగానే ఉదయం తన పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పాము కాటేసింది. స్థానికులు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. యాదయ్యకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

జిల్లా పంచాయతీ శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. బాసర జోన్ పరిధిలో జరిగే గ్రేడ్-1, 2, 3 కార్యదర్శుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసిన అధికారులు మంగళవారం ప్రకటించారు. గ్రేడ్-1లో ఎనిమిది మందికి గాను ఒకరు, గ్రేడ్-2లో 09 మందికి నలుగురు, గ్రేడ్-3లో 57 మందికి 41 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరు తప్పనిసరిగా బదిలీపై వెళ్లనున్నారు. ఈమేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఇస్కాన్ టెంపుల్ కూకట్‌పల్లి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పూరి జగన్నాథ రథయాత్ర బుధవారం దేవరకొండ పట్టణానికి చేరుకోనుంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన కమిటీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పట్టణానికి చేరుకోనున్న రథయాత్ర స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై కొండల్రావు బంగ్లా వరకు కొనసాగనుంది. అనంతరం రాత్రి 7గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గుండెపోటుతో ఎస్ఐ మృతి చెందిన ఘటన బుధవారం దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. దమ్మపేట పోలీస్ స్టేషన్లో రెండో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సీమా నాయక్ ఖమ్మం నగరంలోని ఆయన నివాసంలో ఛాతి నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఎస్ఐను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శాఖాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని(19) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

పురుగు మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. సూర్యాపేటకు చెందిన బాలిక(15) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 6న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.