India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వర్షం కారణంగా చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందే పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్డీవోలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడైనా వర్షం నీటికి తెగిపోయేందుకు, గండ్లు పడేందుకు అవకాశం ఉన్న చెరువులను గుర్తించాలన్నారు.

2024 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్య కోసం క్రైస్తవ మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించనుంది. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా ఈనెల 8 నుండి ఆగస్టు 7లోపు అప్లై చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి కే సంజీవరావు ప్రకటించారు. అప్లై చేసిన కాపీలను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆగస్టు 27 లోపు జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

HYDలో ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని SVITలో ఈ క్యాంప్ జరిగింది. జులై 15న షేక్‌పేటలోని నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ (11:30AM), 20న అబిడ్స్‌లోని మెథడిస్ట్ కాలేజీ (11:00AM)లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ అధ్వర్యంలో లెక్కించారు. దేవాలయానికి భక్తులు సమర్పించిన 70 రోజులకు సంబంధించిన హుండీ డబ్బులను లెక్కించారు. భక్తులు ముడుపుల రూపంలో వేసిన రూ.7,23,433 లక్షల సమకూరినట్లు తెలిపారు.

✓10 మంది BRS ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు:MLA దానం ✓HYD:నిరుద్యోగ దీక్ష చేస్తున్న బక్క జడ్సన్ ఆసుపత్రికి తరలింపు
✓కూకట్పల్లి:రూ.36 కోట్లతో JNTUH లో ఐకానిక్ బిల్డింగ్
✓బాలానగర్:ఫతేనగర్లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య
✓అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు
✓ఉప్పల్: భార్యను హత్య చేసి బ్యాగులో వేసిన భర్త

అత్తారింటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. గడిసింగాపూర్ గ్రామానికి చెందిన గొట్లపల్లి రాంరెడ్డి(30) ఈనెల 6న కొడంగల్ మండలం బల్కాపూర్ గ్రామంలోని అత్తారింటికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బుల్కాపూర్ గేట్ వద్ద బైక్ అదుపుతుప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని తాండూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

✏రైతుల అభిప్రాయాలు స్వీకరించిన కేబినెట్ సబ్ కమిటీ.. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
✏PU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
✏షాద్‌నగర్: ఘోర ప్రమాదం.. లారీ కిందపడి వ్యక్తి మృతి
✏పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి:SFI
✏కొడంగల్: టీచర్లు రాకపోవడంతో పాఠశాలకు తాళం
✏ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాలు
✏వన మహోత్సవం.. అధికారుల ప్రత్యేక ఫోకస్
✏గ్రూప్-1 మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోండి:R. ఇందిర,స్వప్న

చెన్నూర్ పట్టణంలో నూతనంగా రూ.1.90 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 కేవి విద్యుత్తు ఉప కేంద్రాన్ని శుక్రవారం ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామిలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యుత్తు ఉప కేంద్రంలో శాఖ సిబ్బందికి అన్ని ఏర్పాట్లను త్వరలో పూర్తి చేస్తామని హామిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం : డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా గత మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థుల కోసం సర్టిఫికెట్ల పరిశీలన గడువు ఈనెల 18 వరకు పొడిగించామని SR&BGNR కళాశాల దోస్త్ కోఆర్డినేటర్ ఎం. సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కేటీఆర్ కొడుకు హిమాన్షును బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో హిమాన్షు తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శతమానం భవతి అని తాతయ్య, నానమ్మ హిమాన్షును ఆశీర్వదించారు. హిమాన్షు 19వ ఏట అడుగు పెట్టడంతో..19 కిలోల కేక్‌ను కుటుంబ సభ్యులు కట్ చేయించారు. హిమాన్షు పుట్టిన రోజు వేడుకల్లో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, అమ్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.