India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉందని, అది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమైందని బీజేపీ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలి హిల్ రిడ్జ్ కాలనీలో ఆయన మాట్లాడారు. అసాధ్యం అనుకున్న అనేక కార్యక్రమాలను సుసాధ్యం చేశారని, అందుకే నరేంద్ర మోదీ గ్రేట్ అని కొనియాడారు. దేశాభివృద్ధి ఇదే వేగంతో కొనసాగాలంటే ప్రజలు బీజేపీకే ఓటు వేయాలన్నారు.
ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను HYD పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా HYDలో ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో ధర్మభిక్షం జన్మించారు. నిజాం నవాబు ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. ప్రజలను చైతన్య పరిచేవారు. ధర్మభిక్షం 3సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. కాగా ఇవాళ ధర్మభిక్షం వర్ధంతి.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. BRS సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ను ఆయన కలిసి తన మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి సంకేతాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. BRS సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ను ఆయన కలిసి తన మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి సంకేతాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లు ఉండటంతో మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టిసారించిన సీపీ.. ఆయా ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాంల కోసం కుట్టుకూలి ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ముడి సరకును దర్జీలతో కుట్టిస్తుండగా 2023 -24 విద్యాసంవత్సరానికి కుట్టు కూలిని ఇటీవల మంజూరు చేసింది. సర్వ శిక్ష అభియాన్ నుంచి మొత్తంగా రూ.2.82 కోట్లు మంజూరయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో 8వేల ఎకరాలో 2.98 లక్షల టన్నుల చెరకు కోతలు పూర్తయినట్లు కృష్ణవేణి చెరకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజన్న తెలిపారు. 2023-24 సీజన్‌లో కృష్ణవేణి పరిశ్రమ యాజమాన్యంతో రైతులు ఒప్పందం చేసుకుని చెరకు సాగు చేశారన్నారు. పంట కోతకు కావాల్సిన కార్మికులను, యంత్రాలను యాజమాన్యం కేన్ కమిషనర్ ఆదేశంతో ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే సీజన్కు రైతులతో గిట్టుబాటు ధర వచ్చేవిధంగా ఒప్పందం చేసుకోవాలని కోరారు.
మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై జరిగిన దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సోమవారం ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రజాకార్ల అరాచకాలను చూపిస్తే, కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరమ్మ పాలన ఎలా ఉందో చూపించాలని అనుకుంటున్నారా..? అని ధ్వజమెత్తారు. హిందువులపై దాడులు చేసిన వారిని వదిలేసి దారులకు గురైన వారిపైనే లాఠీ చార్జి చేస్తారా..? అని ప్రశ్నించారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. బస్సు చిట్యాల వద్దకు రాగానే అతనికి గుండెపోటు వచ్చిందని తోటి ప్రయాణికులు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్సులో హైదరాబాద్‌కి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.