India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) <<12882624>>హత్య కేసు మిస్టరీ<<>> వీడింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. అమ్మాయి తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తె తీరును జీర్ణించుకోలేక కోపంతో కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మంలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలకానుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ ఖాతా తెరవలేదు. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైన గెలవాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.
యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. SI చింత రాజు ప్రకారం.. భువనగిరి జిల్లాకు చెందిన సిద్దారెడ్డి కొన్ని నెలలుగా మండలంలోని ఓ గ్రామంలో తన అక్క వద్ద ఉంటూ.. పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(19)పై మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐపీసీ 452, 376 ప్రకారం యువకుడిపై కేసు నమోదైంది.
మాజీ భర్తపై యాసిడ్ దాడి జరిగిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. ఎస్సై అనిల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేశ్‌కు, మెట్‌పల్లికి మండలానికి చెందిన మాస లక్షణతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో మహేశ్ మరో పెళ్లికి సిద్ధమవుతుండగా.. మంగళవారం లక్షణ, మహేశ్ ఇంటికెళ్లి అతనిపై యాసిడ్ దాడి చేసింది. దీంతో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకొంది. SI చింత రాజు ప్రకారం.. భువనగిరి జిల్లాకు చెందిన సిద్దారెడ్డి కొన్ని నెలలుగా మండలంలోని ఓ గ్రామంలో తన అక్క వద్దనే ఉంటూ.. పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(19)పై మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐపీసీ 452, 376 ప్రకారం యువకుడిపై కేసు నమోదయింది.
ఒకరిపై కత్తితో దాడిచేసి కేసులో ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోలిపూరకు చెందిన మునీర్ బేగ్‌పై సోమవారం రాత్రి 11 గంటలకు కేఆర్కే కాలనీకి చెందిన షేక్ షాబాద్, సయ్యద్ రెహాన్ హష్మీ కత్తితో దాడితో చేశారు. బాధితుడి తల్లి గులాబ్ బీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతల్లి కళ్ల ముందే నిర్జీవంగా మారగా.. ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో పదోతరగతి పరీక్షకు హాజరైన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. దేవరకద్ర పట్టణానికి చెందిన అంజమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. ఆమె రెండో కూతురు జ్యోతి ఓవైపు తల్లి మృతితో కన్నీటి పర్యంతం అవుతూనే.. మరోవైపు మంగళవారం జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.
బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం <<12887148>>అర్ధరాత్రి <<>>జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు బైకులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మృతులు వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన పఠాని రిషి, ముప్కాల్‌కు చెందిన ఉద్ధవ్‌గా పోలీసులు గుర్తించారు.
నల్గొండ జిల్లా సమాఖ్య భవనంలో పార్లమెంటు ఎన్నికల స్వీప్ కార్యక్రమాలలో భాగంగా క్రమబద్ధమైన ఓటరు విద్య పై మహిళా సంఘాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన ప్రతి మహిళ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, అడిషనల్ DRDO శారద పాల్గొన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి జరగనున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 3నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.