Telangana

News March 26, 2024

నేడు రైతు నేస్తం దృశ్య శ్రవణ ప్రత్యక్ష ప్రసారం

image

ఉమ్మడి జిల్లా పరిధిలో ఎంపిక చేసిన రైతువేదికల్లో నేడు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానంపై అఖిల భారత సమగ్ర వ్యవ సాయ పద్ధతుల పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎం.గోవర్ధన్, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ప్రధాన శాస్త్రవేత్తలు మెళకువలు చెబుతారు.

News March 26, 2024

ప్రభుత్వ పాఠశాలలకు రూ.91 లక్షలు మంజూరు

image

నల్గొండ జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఏటా స్కూల్ మెయిన్టెనెన్స్ కింద (చాక్పీసులు, డస్టర్లు , స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలు కోసం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తుంది. రెండేళ్లుగా ప్రభుత్వం జూలై, జనవరి నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులు ఇస్తుంది. మూడు రోజుల క్రితం జిల్లాకు రూ.91 లక్షలు మంజూరు చేసింది.

News March 26, 2024

HNK: ఈనెల 27, 28న జాతీయ సదస్సు

image

హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం ఇన్చార్జ్ హెడ్ డాక్టర్ మాదాసి కనకయ్య సోమవారం తెలిపారు. ‘ఫీన్టెక్ రెవల్యూషన్ రీషెపింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్ ది డిజిటల్ ఏజ్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ తాటికొండ రమేశ్ వస్తారని అన్నారు.

News March 26, 2024

MBNR: ఇంటి నుంచే ఓటు.. ఈసీ వెసులుబాటు!

image

మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 1,916 పోలింగ్ కేంద్రాలు ఉండగా..16,80,417 మంది ఓటర్లు ఉన్నారు.85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు 6,047 మంది, దివ్యాంగ ఓటర్లు 32,731 మంది ఉన్నారు. వీరికి పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బంది ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్‌లో ఓటు వేయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. హోం ఓటింగ్ ప్రక్రియకు ఫారం-12డీ దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది.

News March 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓నేలకొండపల్లిలో రైతు నేస్తం కార్యక్రమం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభo
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓అశ్వరావుపేటలో ఎమ్మెల్యే పర్యటన
✓సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పర్యటన

News March 26, 2024

నేడే నిజామాబాద్ DCCB ఛైర్మన్ ఎన్నిక

image

నిజామాబాద్ DCCB ఛైర్మన్ ఎన్నిక ఈరోజు జరగనుంది. ఈ ఎన్నిక కోసం సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు మొత్తం 21 మంది సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ రమేశ్ రెడ్డికే పట్టం కట్టేందుకు సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 21న మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.

News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏మహబూబ్ నగర్: నేడు 5K రన్
✏రసవత్తంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప’పోరు’
✏పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✏NGKL,కొల్లాపూర్:నేడు డయల్ యువర్ డిఎం
✏రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(బుధ)-6:34,సహార్(గురు)-4:56
✏ఉమ్మడి జిల్లాలో త్రాగునీటిపై అధికారుల ఫోకస్
✏ఇంటి నుంచే ఓటు.. అధికారుల సమీక్ష
✏లోక్ సభ ఎన్నికలు.. గ్రామాల్లో ప్రచారం
✏పెద్ద పెద్దపల్లి: నేడు తైబజార్ వేలం
✏ఎలక్షన్ కోడ్.. పలు చోట్ల తనిఖీలు

News March 26, 2024

WGL: మద్యం మత్తులో యువకుల వీరంగం

image

హోలీ వేళ యువకులు మద్యం మత్తులో పరస్పర దాడులు చేసుకున్న ఘటన వరగంల్‌లో జరిగింది. మధ్యకోట, పడమరకోటకు చెందిన యువకులు నిన్న సాయంత్రం కత్తికోటలో మందు తాగారు. వరంగల్‌కు చెందిన మరో 10 మంది బైక్‌లపై రాగా రంగులు పూసుకుని విషెష్ చెప్పుకున్నారు. కొద్దిసేపటికి వీరి మధ్య గొడవ జరగ్గా రెండు గ్రూపులుగా విడిపోయి దాడి చేసుకున్నారు. సినిమా స్టైల్‌లో రోడ్డుపై పరుగులు పెడుతూ కొట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

News March 26, 2024

గోదావరిఖని: నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి

image

గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన లక్కీ(4) అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ అనే కూలీ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం కుటుంబంతో గోదావరిఖనికి వచ్చి స్థిరపడ్డాడు. వినోద్ కొడుకు సోమవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ముఖంపై గాయం కావడంతో సర్జరీ కోసం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. కుక్కల బెడదను తొలిగించాలని స్థానికులు కోరుతున్నారు.

News March 26, 2024

స్పోర్ట్స్ స్కూళ్లలో ఎంపికకు నేడు, రేపు పోటీలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని క్రీడాపాఠశాలల్లో విద్యార్థుల ఎంపికకు మంగళ, బుధవారాల్లో తుది పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడల అధికారి బొల్లి గోపాల్‌రావు తెలిపారు. కిన్నెరసానిలోని బాలుర, కాచనపల్లిలోని బాలికల క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 5, 6వ తేదీల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు 26, 27వ తేదీల్లో చివరి దశ పోటీలు నిర్వహించనున్నారు.