India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రూ.100 కోట్లతో సూర్యాపేటని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్‌తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి.. సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

షాద్‌నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్‌కు చెందిన స్ధిరాస్తి వ్యాపారి కమ్మరి కృష్ణను షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న తన ఫామ్ హౌస్‌లో దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిజామాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అహ్మదీ బజార్‌లో ఉన్న ఉర్దూ ఘర్‌లో గ్రూప్ -2, గ్రూప్ -3 అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తెలిపారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో పలువురు IPS అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వరంగల్ రేంజ్ ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2016లో పూర్వపు మెదక్ జిల్లా ఎస్పీగా, అనంతరం సంగారెడ్డి ఎస్పీగా చేశారు. 2019లో DIG ర్యాంక్ పదోన్నతి పొందారు. 2021 నుంచి రామగుండం సీపీగా పనిచేశారు.

నర్సంపేటలో ఇటీవల జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను టౌన్ సీఐ రమణ మూర్తి బుధవారం వెల్లడించారు. NSPT ఇందిరమ్మకాలనీకి చెందిన ప్రవీణ్, రాజు, పవన్, శివ కుమార్ అనే నలుగురు మద్యానికి బానిసయ్యారు. మద్యం తాగేందుకు డబ్బుల కోసం నాలుగు రోజుల క్రితం కిరాణా షాపు నడుపుకుంటున్న రహీం ఇంట్లో ఒక్కడే ఉన్నాడని తెలుసుకున్నారు. అతనిపై పిడిగుద్దులతో దాడిచేసి, గొంతు నులిమి హత్య చేసి బావిలో పడేశారని తెలిపారు.

కరీంనగర్ శివార్లలోని ఎలగందులలో 18వ శతాబ్దానికి చెందిన మెట్లబావి ఉంది. దీనిని నాగన్నబావి అని ఇక్కడి స్థానికులు పిలుస్తుంటారు. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప, ఇక్కడ మెట్ల బావి ఉన్న సంగతి తెలియదు. ఎందుకంటే, నేలమట్టం నుంచి కిందకు 20 మీటర్ల లోతులో బావిని నిర్మించారు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఇలాంటి బావులను సంరక్షించి, మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

గ్రూప్-I మెయిన్స్ కొసం ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్-I మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce లో జులై 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ ఈనెల 22 నుంచి 75 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లో 150, ఖమ్మంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

బైక్‌పై తరలిస్తున్న 2.250 కిలోల ఎండు గంజాయిని నిజామాబాద్‌లోని చంద్రశేఖర్ కాలనీ ఎక్స్‌రోడ్ వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నగరంలో బాబా ఖాన్, బీబీపేట్‌కి చెందినకిషన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండలో ఉంటున్న పేరెంట్స్ వద్ద కాలేజీ ఫీజు కోసం అని రూ. 1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌లో పొగొట్టాడు. కష్టం చేసి తెచ్చిన డబ్బు వృథా చేశావని పేరెంట్స్ మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండలో ఉంటున్న పేరెంట్స్ వద్ద కాలేజీ ఫీజు కోసం అని రూ. 1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌లో పొగొట్టాడు. కష్టం చేసి తెచ్చిన డబ్బు వృథా చేశావని పేరెంట్స్ మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.