India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా పంచాయతీ శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. బాసర జోన్ పరిధిలో జరిగే గ్రేడ్-1, 2, 3 కార్యదర్శుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసిన అధికారులు మంగళవారం ప్రకటించారు. గ్రేడ్-1లో ఎనిమిది మందికి గాను ఒకరు, గ్రేడ్-2లో 09 మందికి నలుగురు, గ్రేడ్-3లో 57 మందికి 41 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరు తప్పనిసరిగా బదిలీపై వెళ్లనున్నారు. ఈమేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఇస్కాన్ టెంపుల్ కూకట్‌పల్లి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పూరి జగన్నాథ రథయాత్ర బుధవారం దేవరకొండ పట్టణానికి చేరుకోనుంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన కమిటీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పట్టణానికి చేరుకోనున్న రథయాత్ర స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై కొండల్రావు బంగ్లా వరకు కొనసాగనుంది. అనంతరం రాత్రి 7గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గుండెపోటుతో ఎస్ఐ మృతి చెందిన ఘటన బుధవారం దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. దమ్మపేట పోలీస్ స్టేషన్లో రెండో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సీమా నాయక్ ఖమ్మం నగరంలోని ఆయన నివాసంలో ఛాతి నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఎస్ఐను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శాఖాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని(19) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

పురుగు మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. సూర్యాపేటకు చెందిన బాలిక(15) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 6న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ పట్టణ కేంద్రంలోని లేబర్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన చేరాలు(45).. భార్య స్వప్నను(40) సోమవారం రాత్రి రోకలిబండతో కొట్టి చంపి పోలీసులకు పట్టుబడతాననే భయంతో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మంచిర్యాలలోని ఒక రెస్టారెంట్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాలతో మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి రూ.1 లక్ష 78 వేలు నగదు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు సమాచారం.

బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు గర్భవతిని చేశారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. చండ్రుగొండ మండలంలోని ఇమ్మిడిరామయ్యబంజర్ వాసి కంపసాటి రవి ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్‌లో బంధించానని ఎవరికైనా చెబితే వాట్సాప్‌లో పెడతానని బెదిరించాడు. బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.

నేడు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. నిజామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MBNR, NGKL డీఈవోలు రవీందర్, గోవిందరాజులు తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు అర్హులని, https://awards.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి MBNR జిల్లాలోని పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా HMలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, న్యూఢిల్లీలో ఈ పురస్కారాలను అందిస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.