India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్‌టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధ నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు నదీమాబాదుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో 2017 సంవత్సరంలో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేసింది. NGKL జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారిగా ఉన్న అంజిలప్ప, ఏడీ కేశవసాయి ఏసీబీ అధికారులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. వీరు ఉమ్మడి జిల్లాలో 4 సంవత్సరాల పాటు పనిచేశారు. వీరి హయాంలో జరిగిన గొర్రెల యూనిట్ల పంపిణీ ఏమైనా అవినీతి జరిగిందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రికార్డులను తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
హుజూర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని క్రేన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీర భాగాలు నుజ్జు నుజ్జు కాగా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
మణుగూరు కొండాయిగూడెం గోదావరి తీర ప్రాంతంలో హోలీ పండుగ నేపథ్యంలో స్నానానికి వెళ్లి మునిగిపోతున్న ముగ్గురు యువకులను స్థానిక పోలీసులు రక్షించారు. ఈ ముగ్గురు యువకులు సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన వారు. గోదావరి నీటి ప్రమాదం నుండి ముగ్గురు యువకులను కాపాడిన TSSP కానిస్టేబుల్ వినయ్, సనై కానిస్టేబుల్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి గ్రామానికి గోపులాపురం కార్తీక్( 22) అనే యువకుడు గూడెం లిఫ్ట్ కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ స్వస్థలం జన్నారం మండలం ధర్మారం గ్రామం కాగా హోలీ పండుగకు తన తాత ఇంటికి వచ్చాడు. గూడెం లిఫ్ట్ కాలువలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
✓రైలు బయలుదేరే సమయంలో, స్టేషన్ చేరుకునేటప్పుడు రైళ్లు ఎక్కొద్దు, దిగే ప్రయత్నం చేయొద్దు
✓నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించొద్దు
✓ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను వాడాలి
✓ట్రాక్ దగ్గర నడిచే సమయంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించొద్దు
✓రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో సెల్ఫీ, ఫొటో గ్రఫీ తీసుకోవడంపై నిషేధం ఉంది. •వీటిని పాటించాలని SCR ట్వీట్ చేసింది.
✓రైలు బయలుదేరే సమయంలో, స్టేషన్ చేరుకునేటప్పుడు రైళ్లు ఎక్కొద్దు, దిగే ప్రయత్నం చేయొద్దు
✓నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించొద్దు
✓ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను వాడాలి
✓ట్రాక్ దగ్గర నడిచే సమయంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించొద్దు
✓రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో సెల్ఫీ, ఫొటో గ్రఫీ తీసుకోవడంపై నిషేధం ఉంది. •వీటిని పాటించాలని SCR ట్వీట్ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆర్థిక సంవత్సరం ముగింపులో విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులను విద్యా సంవత్సరం మధ్యలో విడుదల చేయాల్సి ఉన్నా పాఠశాలల మూతపడే ముందు విడుదల చేసింది. శనివారం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే నిధులు వెనక్కి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.