Telangana

News July 10, 2024

కొత్తగూడెం: ‘సింగరేణిపై కేంద్రం కుట్రలను ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలి’ 

image

చట్టసభలో ఉన్న మందబలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. చట్టాలను తీసుకొస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని సింగరేణి సంస్థను దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.

News July 10, 2024

పదేళ్ల పాలనలో గద్వాలకు చేసిందేమీ లేదు: డీకే అరుణ

image

పదేళ్ల BRS పాలనలో గద్వాల ఎలాంటి అభివృద్ధి జరగ లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. బుధవారం పట్టణంలోని ఎస్వీ ఈవెంట్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఇండ్లు, ఇండ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో మిగిలిన పనులు చేయలేదన్నారు. ఇక్కడి నేతలు అధికారం కొరకు పాకులాడుతున్నారని, ఎమ్మెల్యే బండ్ల ఏం చేసేందుకు కాంగ్రెస్‌లో చేరారని ప్రశ్నించారు.

News July 10, 2024

NLG: ఆకతాయిలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ వారికి రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్లను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సందర్భంగా ఎస్సీ హెచ్చరించారు.

News July 10, 2024

KNR: డయేరియా నివారణకు కృషిచేయాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియా వ్యాధి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారులు డయేరియా వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా నివారణకు కృషిచేయాలన్నారు. ఈ వ్యాధి నివారణ తీసుకోవాల్సిన చర్యలపై ప్లాష్ మాబ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.

News July 9, 2024

పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైంది: రేవంత్

image

 తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘MLAలు,MLCలు పార్టీ మారుతున్నారని కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. తన వరకు వస్తే కాని KCRకు ఆ బాధ తెలియలేదు. గత పదేళ్లలో ఎంతో మంది కాంగ్రెస్‌ MLAలను తన పార్టీలో చేర్చుకోలేదా? ఈ ప్రభుత్వం నెల రోజులలోనే కూలిపోతుందని కేసీఆర్‌ అనలేదా? అని మండిపడ్డారు.

News July 9, 2024

మహబూబ్‌నగర్: TODAY TOP NEWS

image

✒MBNRలో సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉమ్మడి జిల్లా MLAలు
✒త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం రేవంత్
✒మక్తల్: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు
✒గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యా: సినీనటి మంచు లక్ష్మి
✒పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన సీఎం
✒ఫీజుల దోపిడీని అరికట్టాలి:PDSU
✒ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ వేడుకలు
✒పలుచోట్ల వర్షాలు
✒రోడ్డు ప్రమాదాలపై అవగాహన

News July 9, 2024

కరీంనగర్: అంధుల పాఠశాల విద్యార్థి అనుమానస్పద మృతి

image

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని అంధుల పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. గదిలో మెడకు తాడు చుట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించిన యువకుడి మృతదేహం. పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేపట్టారు.

News July 9, 2024

కొత్తగూడెం: ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎస్

image

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం ఆమె రాష్ట్ర, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. వనపర్తి జిల్లా దగడలో 58.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు 48.0 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 46.0 మి.మీ, జడ్చర్లలో 43.0 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 9, 2024

షాద్‌నగర్: అంతర్జాతీయ దొంగల అరెస్ట్

image

షాద్‌నగర్ పట్టణంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 30న అయ్యప్ప కాలనీలో నివాసముండే గాదం రమేష్ ఇంట్లో పాచి పనికి నేపాల్‌కు చెందిన ప్రసన్న బాదువాల్ వచ్చింది. ఆమె భర్త ప్రశాంత్ బదువాల్‌తో కలిసి రమేశ్ ఇంట్లో 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు.