India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడానికి, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ ఏర్పాటు చేశామన్నారు.
హోలీ (Holi) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలి రోజున రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన, బైక్‌లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని పెర్కొన్నారు. వాహనాలపై గుంపులు.. గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, సమావేశాలు ఏర్పాటు విషయమై చర్చించామని నేతలు తెలిపారు. పాలమూరు మహాసభకు రాహుల్ గాంధీ ఆహ్వానించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పాల్గొన్నారు.
హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోళీ వేడుకను ప్రజలందరి జీవితాలలో సంతోషం వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. మన సంస్కృతి, సాంప్రదాయాల కనుగుణంగా జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని కలెక్టర్ అభిలషించారు.
బీజేపీ ఖమ్మం ఎంపీ టికెట్‌ను తాండ్ర వినోద్ రావుకు అధిష్ఠానం కేటాయించింది. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఆయన.. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు. 2015 నుంచి 2021 వరకూ ఏకలవ్య ఫౌండేషన్ తరఫున విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో సేవలందించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసి పలువురి ప్రసంశలు అందుకున్నారు.
HYD బాలానగర్‌లో <<12918850>>యువకుడు ప్రణీత్ తేజ<<>> (20)ను స్నేహితుడే చంపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మద్యం తాగుదామని తీసుకెళ్లిన స్నేహితుడు.. ప్రణీత్ మత్తులోకి జారుకున్నాక మెడ, కడుపు కోసి చంపేశాడు. అనంతరం సైకో లాగా కడుపులోని పేగులను బయటకు తీశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
HYD బాలానగర్‌లో <<12918850>>యువకుడు ప్రణీత్ తేజ<<>> (20)ను స్నేహితుడే చంపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మద్యం తాగుదామని తీసుకెళ్లిన స్నేహితుడు.. ప్రణీత్ మత్తులోకి జారుకున్నాక మెడ, కడుపు కోసి చంపేశాడు. అనంతరం సైకో లాగా కడుపులోని పేగులను బయటకు తీశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
నగరంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహీర్ బీన్ హందాన్, కేశ వేణు, రత్నాకర్. ఖుద్దుస్, తదితరులున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు మెట్టు కాడి శ్రీనివాస్, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులకు పార్టీ కండువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి డీకే అరుణ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.