Telangana

News March 24, 2024

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో పండగ వాతావరణం!

image

హోలీ పండుగను పురష్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్, బస్టాండ్ రోడ్, గాంధీచౌక్, అలాగే జిల్లాలోని అన్ని గ్రామాల్లో సందడి కనిపించింది. హోలీ పండుగను జరుపుకోవడానికి కావలసిన రంగులు, పిచికారీ సామాన్లు, మాస్కులు, తదితర పరికరాలను దుకాణాదారులు విక్రయించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో హోలీ సందడి కనిపిస్తోంది.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని MDK, SRD, సిద్దిపేట జిల్లాల పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. >>>SHARE IT

News March 24, 2024

HYD: బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య

image

ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలానగర్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ పరిధి APHB కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ఓ బస్సులో స్థానికంగా నివాసం ఉండే పులి ప్రణీత్ తేజ అనే యువకుడిని అతడి స్నేహితుడే మద్యం మత్తులో నమ్మించి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2024

HYD: బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య

image

ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలానగర్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ పరిధి APHB కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ఓ బస్సులో స్థానికంగా నివాసం ఉండే పులి ప్రణీత్ తేజ అనే యువకుడిని అతడి స్నేహితుడే మద్యం మత్తులో నమ్మించి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2024

ఏడుపాయలలో కనుల పండువగా దుర్గమ్మ పల్లకి సేవ

image

ఏడుపాయల వన దుర్గమ్మ సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ కనుల పండువగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకోగా పల్లకి సేవలో పాల్గొని భక్తులు తరించిపోయారు.

News March 24, 2024

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

image

దేవరకొండలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బస్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలిని ఢీ కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు నెమలిపూర్ తండాకు చెందిన నీరిగా గుర్తించారు. కాగా ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో యువకులు హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి వెళ్తున్నట్టు సమాచారం.

News March 24, 2024

జగిత్యాల: డీసీఆర్బీ ఎస్‌ఐ సస్పెండ్

image

జగిత్యాల డీసీఆర్బీ ఎస్సై వెంకట్రావును సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం తెలిపారు. కొడిమ్యాల పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా చేసిన సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని వచ్చిన ఆరోపణపై విచారణ చేపట్టారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా ఎస్సై వెంకట్రావును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ వివరించారు.

News March 24, 2024

ఖమ్మం జిల్లాలో 690.. భద్రాద్రిలో 279..

image

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన అధిక ఫిర్యాదులు సీ – విజిల్ యాప్ ద్వారానే ఎన్నికల సంఘం దృష్టికి వచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి 690, భద్రాద్రి జిల్లా నుంచి 279 ఫిర్యాదులు అందాయి. వీటిలో కొన్నింటిని ఫిర్యాదుదారులు ఉపసంహరించుకోగా మిగిలిన వాటిని సంబంధిత అధికారులు పరిష్కరించారు. యజమానుల అనుమతి లేకుండా గోడపత్రికలు అంటించడం, ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.

News March 24, 2024

నల్గొండ: వృద్ధురాలు దారుణ హత్య

image

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణిలోని వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న ఔరవాణి గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ (68) అదృశ్యమైంది. అప్పటి నుంచి వెతుకుతున్నా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం దొరికింది. పిచ్చమ్మను దుండగులు హత్య చేసి బావిలో పడేశారని పోలీసులు తెలిపారు.

News March 24, 2024

NZB: ‘హజ్ యాత్రికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’

image

హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, మక్కాకు వెళ్ళిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో జిల్లా హజ్ సొసైటీ మౌలానా సయ్యద్ అబీద్ ఖాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండవ హజ్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ముహమ్మద్ షబ్బీర్ అలీ హాజరయ్యారు.