Telangana

News August 26, 2024

HYD: గణేశుడిని నిలబెట్టేవారికి ముఖ్య గమనిక

image

➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT

విద్యార్థులను అభినందించిన ఎంపీ కావ్య

image

ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను వరంగల్ ఎంపీ కడియం కావ్య అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కరాటేతో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరిగి చదువులో సైతం రాణించే అవకాశం ఉందని, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలు తప్పకుండ కరాటే నేర్చుకోవాలన్నారు.

News August 26, 2024

HYD: మాయమైన చెరువు.. పోలీసులకు ఫిర్యాదు

image

హైదరాబాద్ శివారు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని 8 ఎకరాల తుమ్మలచెరువు రాత్రికి రాత్రే మాయమైందని మహేశ్వరం బీజేపీ ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ పహాడీ‌షరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చెరువులను కబ్జాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 26, 2024

MBNR: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి !

image

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. పంచాయతీల్లో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది.MBNR-441, NGKL-463, GDWL-255, NRPT-290, WNPT-255 జిల్లాలో గ్రామపంచాయతీలు ఉన్నాయి.

News August 26, 2024

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు: హరీశ్

image

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయ‌ని MLA హ‌రీశ్‌రావు అన్నారు. ‘సంగారెడ్డి (D) వట్‌పల్లి (M) మేడికుందా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక కాలి నడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ నీళ్లు తాగి విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని హ‌రీశ్‌రావు Xలో పోస్టు చేశారు.

HYD: CMRF స్కాం.. ఆసుపత్రులపై లిస్ట్ ఇదే..!

image

HYD నగర ఆసుపత్రుల్లో ఫేక్ బిల్స్ వేసి CMRF స్కాంకు పాల్పడినట్లు CID పోలీసులు FIR నమోదు చేశారు. కేసు నమోదు చేసిన ఆసుపత్రులు లిస్టులో ఐఎస్ సదన్ అరుణశ్రీ హాస్పిటల్, సైదాబాద్ శ్రీకృష్ణ, మీర్‌పేట్ హిరణ్య, హస్తినాపురం డెల్టా, బి.యన్ రెడ్డి నగర్ శ్రీరక్ష, సాగర్‌రింగ్ రోడ్డు MMS, కొత్తపేట MMV ఇంద్రా మల్టీ స్పెషాలిటీ, బైరామల్‌గూడ శ్రీ సాయి తిరుమల, శారదానగర్ ADRM ఆస్పత్రులు ఉన్నట్లుగా తెలిపారు.

News August 26, 2024

కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

image

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. మల్లెల మడుగు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పురుగులు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే స్థానిక ప్రజలు వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

WGL 25వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్సీ సారయ్య

image

WGL 25వ డివిజన్లో MLC బస్వరాజు సారయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్సీ ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని, కాంగ్రెస్‌కు కార్యకర్తలే పట్టుకొమ్మలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.