India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలను ఈనెల 5న సంగారెడ్డిలోని డా. బీఆర్ అంబేద్కర్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎండీ జాబిద్ అలీ తెలిపారు. 8, 10, 12ఏళ్ల బాలబాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఇందులో ఎంపికైన వారు ఈ నెల 7న గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు.

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన నేడు స్థాయీ సంఘం సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 11 అంశాలకు సంబంధించి.. అన్ని పార్టీల సభ్యులు చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపనున్నారు. GHMCలోని వివిధ శాఖల అధికారులు, సభ్యులు ఈ భేటీకి హాజరవుతారు.

కిన్నెరసానిలో వేటకు వెళ్లిన జాలర్లకు 12 కిలోల భారీ చేప (బొచ్చె రకం) చిక్కింది. దాన్ని పాల్వంచ మార్కెట్లో విక్రయానికి పెట్టారు. భారీ చేపను దక్కించుకునేందుకు పలువురు పోటీపడ్డారు. కిలోకు రూ.200 చొప్పున వెచ్చించి ఒకరు కొనుగోలు చేశారని అని జాలర్లు వెల్లడించారు. కాగా కొన్ని రోజులుగా కిన్నెరసానిలో భారీగా చేపలు లభ్యమవుతున్నాయి అని తెలిపారు.

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్మికులపై ఎట్టకేలకు పని భారం తగ్గనుంది. ఆర్టీసీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రీజియన్ పరిధిలో ఖాళీలను అధికారులు గుర్తించారు. మొత్తం 2000 వరకు ఖాళీలు ఉన్నట్లు తేల్చగా అందులో ఎక్కువగా కండక్టర్లు, డ్రైవర్ పోస్టులే ఉన్నాయి. ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వ ప్రకటనతో కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

ఉరేసుకుని ఓ యువతి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల తండాలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన అనూష (20) డిగ్రీ మధ్యలోనే ఆపి వేసి కుటుంబ సభ్యులతో వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో సురేశ్‌తో ప్రేమ ఏర్పడింది. సురేశ్ కు ఇది వరకే పెళ్లి అయ్యి భార్యాపిల్లలు ఉండటంతో పలువురు అనూష – సురేశ్ పెళ్లిని వ్యతిరేకించారు. సురేశ్ వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బయటకు తీసుకువెళ్లి కిడ్నాప్ చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. మైనర్ అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల తరువాత 263 ఎస్ఏ సమాన స్థాయి ఉపాధ్యాయుల ఖాళీలు మిగిలిపోయాయి. MBNR-42, NGKL-51, WNPT-49, NRPT-57, GDWL-64 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయా పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు రెండేసి సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా మిగిలి పోయింది. త్వరలో పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.

ఓ బాలుడు స్నేహితుడి ఇంట్లో చోరీ చేసి వారితోనే PSలో ఫిర్యాదు చేసిన ఘటన NZBలో జరిగింది. బొబ్బొలి వీధికి చెందిన మాధవి ఇంటి మరమ్మతులు చేసినందుకు ఆమె కుమారుడి ఫ్రెండ్‌కి కొంత డబ్బు ఇచ్చింది. కాగా ఆ బాలుడు వారి ఇంట్లో జూన్ 27న రూ.2.20లక్షలు చోరీ చేశాడు. ఈనెల 2న బీరువాలో డబ్బు కనిపించకపోవడంతో మాధవి వారిద్దరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని నింధితుడిగా గుర్తించారు.

అమరచింతలో GOVT టీచర్‌పై రౌడీషీటర్ దాడి చేశాడు. MEO భాస్కర్ సింగ్ వివరాలు.. స్థానిక స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి హోం వర్క్ చేయలేదని సోమవారం టీచర్ కొట్టారు. ఈ విషయమై విద్యార్థి తండ్రి పాఠశాలకు రాగా నచ్చజెప్పి పంపారు. బుధవారం విద్యార్థి తండ్రితోపాటు వచ్చిన రౌడీషీటర్ సదరు టీచర్‌పై దాడీచేసి బ్లేడ్‌తో బెదిరించి వెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని కానీ కేసు వద్దన్నారని SI సురేశ్ చెప్పారు.

వర్షాల నేపథ్యంలో రోడ్లపై భారీగా నిలిచే నీళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా జలమండలి డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 238 స్టాటిక్, 154 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వర్షపు నీటి తొలగింపులో నిమగ్నమయ్యాయి. రాత్రి నగరంలో పలుచోట్ల కురిసిన వర్షానికి నీరు నిలిచిన ప్రాంతాల్లో ఈ బృందాలు నీటిని తొలగించాయి.
Sorry, no posts matched your criteria.