India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. న్యూ మల్లేపల్లి, గోకుల్‌నగర్‌కు చెందిన టి.మనోహర్(33) కుటుంబ సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్‌కు లోనయ్యాడు. నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. ఉదయం హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో శ్రవణ్(28), షేక్ రహీం పాషా(30) అనే <<13566329>>ఇద్దరు యువకులు<<>> మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రవణ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం హిందూ సాంప్రదాయాల ప్రకారం పూర్తయ్యాయి. అయితే శ్రవణ్ మృతదేహానికి కన్నతల్లి తలకొరివి పెట్టింది. పెళ్లికాకపోవడం, తండ్రి లేకపోవడంతో కన్నీటిపర్యంతం అవుతూ తల్లి తలకొరివి పెట్టగా.. ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. న్యూ మల్లేపల్లి, గోకుల్‌నగర్‌కు చెందిన టి.మనోహర్(33) కుటుంబ సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్‌కు లోనయ్యాడు. నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. ఉదయం హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫమైందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. గురువారం ఎర్రవెల్లిలో ఆయన నివాసానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ కొనసాగించడం లేదని ఆరోపించారు.

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. వానా కాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జులై 1న బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదలడంతో గోదావరికి వరద నీరు వస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు.

జూన్ 30తో కరీంనగర్ స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పూర్తికాగా మార్చి 2025 వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. 2018 నుంచి ఇప్పటి వరకు జరిగిన 80 శాతం పనులకు సంబంధించి 745 కోట్లను సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లుల రూపంలో చెల్లించారు. ఇంకా రూ.191 కోట్లు విడుదల కావలసి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పొడిగించడంతో ఇప్పటికైనా పనులు పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేవరకొండ మండలంలోని ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ పిల్లి వెంకటయ్య యాదవ్ మరణం బాధాకరమని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ఆయన స్వగృహంలో భౌతికకాయన్ని సందర్శించి, కంటతడి పెట్టుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్నేహితుడి వెంకటయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి నివాళులర్పించారు.

ఓ ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన బోయిని యాదగిరి(28) ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన యాదగిరి ఎనగండ్ల శివారులో ఆత్మహత్య చేసుకున్నారు.

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.96,490, ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.41,832, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.26,450, అన్నదానం రూ.28,208 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

కెరమెరి మండలం సుర్దపూర్ గ్రామానికి చెందిన చౌదరి జ్యోతి(24) వాగులో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లిన భర్త సురేందర్‌కు భోజనం తీసుకెళ్తూ పెద్దవాగు దాటుతున్న క్రమంలో నీటిలోతు తెలియక జ్యోతి నీటిమునిగి మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.