Telangana

News July 3, 2024

కౌశిక్ రెడ్డిపై కేసు.. హరీశ్‌రావు ఫైర్!

image

MLA పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌డాన్ని MLA హ‌రీశ్‌రావు ఖండించారు. ‘ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను జడ్పీ స‌మావేశం దృష్టికి తీసుకురావ‌డ‌మే కౌశిక్ రెడ్డి చేసిన త‌ప్పా..? ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనా..?, ఇలాంటి బెదిరింపులకు BRS భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం’ అని హరీశ్‌రావు Xలో పేర్కొన్నారు.

News July 3, 2024

బోడకాకరకాయ ధరలకు రెక్కలు 

image

ఎక్కువ మంది అమితంగా ఇష్టపడే
బోడకాకర కాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మంలో మంగళవారం రూ.550కి కిలో చొప్పున బోడకాకర కాయలు విక్రయించారు. హోల్సేల్ మార్కెట్లో వ్యాపారులు కిలో రూ.450 చొప్పున కొనుగోలు చేసి రూ.100 అధికంగా రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లు, వీధి వ్యాపారుల ప్రాంగణాల్లో విక్రయిస్తున్నారు. గతేడాది రూ. 200 నుంచి రూ. 250 వరకు ఉండగా, ప్రస్తుతం అది రెట్టింపైంది.

News July 3, 2024

రేపటి విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి: SFI

image

హనుమకొండ బాలసముద్రంలోని AISF జిల్లా కార్యాలయంలో SFI, AISF, PDSU, NSUI విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. జులై 4న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రాత పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలని ఖండించాలన్నారు.

News July 3, 2024

కరీంనగర్: గ్రూప్-2 ఉచిత గ్రాండ్ టెస్ట్‌ల దరఖాస్తుకు ఈనెల 5 చివరి తేదీ

image

కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో TGPSC గ్రూప్-2 ఉచిత గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు తమ దరఖాస్తులను www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్లో జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 3, 2024

పొలంలో పొంగులేటి.. BRS సెటైరికల్ ట్వీట్

image

పాలన, పార్టీ కార్యక్రమాలతో
నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి కల్లూరు మండలం నారాయణపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఫొటోలను తన ట్విటర్ అకౌంట్లో పంచుకున్నారు. పొంగులేటి ట్వీట్‌పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

News July 3, 2024

నల్గొండ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించారు. ఉమ్మడి నల్గొండ నుంచి గాజుబిడెం బ్యాక్‌ వాటర్‌లో బస, బోటింగ్, నెల్లికల్‌ ఎకోపార్క్‌లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్‌ ఉండనుంది. దీంతో స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News July 3, 2024

మొక్కలు నాటిన మంత్రి శ్రీధర్ బాబు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు, జిల్లా అడిషినల్ కలెక్టర్ అరుణ శ్రీ, మున్సిపల్ ఛైర్మన్ మమత రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 3, 2024

నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12ప్రాంతాలు గుర్తించారు. నల్లమల పరిధిలో మన్ననూరు, సోమశిలలో వసతి, శ్రీశైలం ఆలయ సందర్శన, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్‌వాటర్‌లో బోటింగ్ ఉండనుంది. దీంతో స్థానికంగా ఉపాది, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News July 3, 2024

BREAKING: HYD: బల్కంపేట్ ఎల్లమ్మ జాతర తేదీల ప్రకటన

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల జాతర తేదీలను నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 9వ తేదీన అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు రానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
SHARE IT

News July 3, 2024

BREAKING: HYD: బల్కంపేట్ ఎల్లమ్మ జాతర తేదీల ప్రకటన

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల జాతర తేదీలను నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 9వ తేదీన అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు రానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. SHARE IT