India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆగస్టు15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి, దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ 5ఏళ్లలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ప్రజాప్రతినిధులుగా బాగా పనిచేశారన్నారు.

నీట్ పరీక్షల ఫలితాలలో అవకతవకల నేపథ్యంలో నేడు దేశం మొత్తం విద్యాసంస్థలకు బంధు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో SFI, PDSU, NSUI, AISF, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం చేశామని ప్రశాంత్ తెలిపాడు. NTA సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం: కామ్రేడ్ దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రజలు కొనసాగించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, కొమరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

✒MBNR-జిల్లా ప్రణాళిక అధికారి దశరథ్ ✒అడ్డాకుల-జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ✒బాలానగర్-జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం బాబురావు ✒భూత్పూర్-జిల్లా హర్టీకల్చర్, సెరీకల్చర్ అధికారి కె.వేణుగోపాల్ ✒సీసీ కుంట-జిల్లా యువజన,క్రీడల అధికారి ఎస్. శ్రీనివాస్ ✒దేవరకద్ర-స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి ✒హన్వాడ-DRDO పి.నర్సింహులు ✒జడ్చర్ల-RDO నవీన్ ✒గండీడ్-SC సంక్షేమ శాఖ డీడీ వి.పాండు

✒రాజాపూర్-జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్.ఇందిర ✒నవాబు పేట-జిల్లా సహకార అధికారి ఎ. పద్మ ✒మూసాపేట-జిల్లా మత్స్యశాఖ అధికారి రాధారోహిణి ✒మిడ్జిల్-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. వెంకటేశ్ ✒కోయిలకొండ-జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బి.మధుసూదన్ గౌడ్ NOTE:నేటి నుంచి నుంచి ఆయా మండలాలకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు జారీ చేశారు.

నారాయణపేటలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గొడుగేరి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఇద్దరు యువకులు స్కూటీపై ప్రధాన రహదారి పైకి వస్తుండగా అదుపుతప్పి వేగంగా వెళుతున్న టిప్పర్ కిందపడి నరసింహారెడ్డి(34) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి చేతికి బలమైన గాయం తగిలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో శిరీష (26) అనే మహిళపై పావని అనే మహిళ కత్తితో దాడి చేసింది. శిరీషకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శిరీషతో తన భర్త దుర్గాప్రసాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో శిరీషపై పావని దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.

కరీంనగర్ డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన దాడుల్లో మేనేజర్ వెంకటేశ్వర రావు, క్యాషియర్ కుమారస్వామిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాదుకు దీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హన్మకొండలో ఈరోజు ఆయన పర్యటించి కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతమని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీల భర్తీకి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

బెల్లంపల్లి NAC సెంటర్‌లో కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లిష్ నేర్పించుటకు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా NAC ఏడీ నాగేంద్రం తెలిపారు. MA ఇంగ్లిష్, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్న యువకులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.