Telangana

News July 6, 2024

సదాశివనగర్: రైతుపై కత్తులతో దాడి చేసిన దుండగులు

image

రైతుపై కత్తులతో దాడి చేసిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తనూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్వతరావు (62) గురువారం పంటచేనులో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు పరుగెత్తి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. దాడికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

HYD: తొలి రోజు బోనాలకు గవర్నర్ రాక

image

ఈనెల 7న ప్రారంభం కానున్న గోల్కొండ కోట జగదాంబికా మహంకాళి బోనాలకు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రానున్నారని భాగ్యనగర్ బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భగవంత్ రావు తెలిపారు. బోనాల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

MBNR: బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్లు జైలు

image

ఓ నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష రూ.5లక్షల జరిమానా రాజేంద్రనగర్ కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం.. NGKL జిల్లాకు చెందిన ఓ కుటుంబం శంషాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, అక్కడే ఉంటున్న శివకుమార్ వారికి పరిచయమై ఓ బాలికను 2017 మే 18 నాందేడ్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పట్లో కేసు నమోదు అయింది. కోర్టు శిక్ష విధించింది.

News July 6, 2024

KNR: ఈ నెల 7న సివిల్స్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష

image

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ కోసం ఈ నెల 7న ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అభ్యర్థులు వెబ్ సైట్ www.studycircle.cgg.gov.in ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News July 6, 2024

HYD: వీధి దీపాల నిర్వహణలో అశ్రద్ధ వహించొద్దు: ఆమ్రపాలి

image

వీధి దీపాల నిర్వహణలో అశ్రద్ధ వహించవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. ఖైరతాబాద్‌లోని తన ఛాంబర్‌లో ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్లతో వీధి దీపాల నిర్వహణపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని, వెంటనే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిటీలో డార్క్ స్పాట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓మణుగూరు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
✓భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News July 6, 2024

నేడు గ్రేటర్ HYD పాలకమండలి సమావేశం

image

నగరాభివృద్ధి, నిర్వహణ పనులు, ప్రజా సమస్యలపై శనివారం హైదరాబాద్ నగర పాలక సంస్థ(GHMC) పాలకమండలి ఖైరతాబాద్‌లోని బల్దియా హెడ్ ఆఫీస్‌లో సమావేశం కానుంది. అందుకు సంబంధించి సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై BRS, కాంగ్రెస్ నేతలు శుక్రవారం పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. BRS కార్పొరేటర్లతో మాజీ మంత్రి తలసాని, ఇతరులు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాల డిమాండ్‌కు వారు తీర్మానించారు.