Telangana

News July 7, 2024

పటాన్‌చెరు: ఐలాపూర్‌ మళ్లీ కబ్జాల కలకలం  !

image

వివాదాస్పద ఐలాపూర్‌ భూముల్లో మళ్లీ కబ్జాదారుల కదలికలు ప్రారంభమయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజవర్గం అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో కోర్టు వివాదంలో నలుగుతున్న భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలు సర్వే నంబర్లలో నాట్‌ టు ఎంటర్‌ ఫియర్‌ పేరుతో కోర్టు డిగ్రీని చూపిస్తూ భూములను చదును చేస్తున్నారు.

News July 7, 2024

గద్వాల: బావిలో పడి బాలుడి దుర్మరణం

image

బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన మల్లేశ్‌(12) శనివారం తాతతో కలిసి గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లాడు. అక్కడ అన్నం తిని నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్లగా బాలుడు అందులో పడ్డాడు. అది గమనించని తాత.. చాలా సేపైనా బాలుడు రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లగా బావిలో పడినట్లు గుర్తించాడు. మృతదేహాన్ని ఇంటికి చేర్చి అంత్యక్రియలు చేశారు.

News July 7, 2024

ఖమ్మం: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

image

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవా పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

News July 7, 2024

కొత్తగూడెం: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బట్టీల గుంపు గ్రామ పంచాయతీలోని పాయం జానకిరామ్ గుంపునకు చెందిన కోరం కృష్ణవేణి (23) అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. పొలంలో పనికి రాకపోవడంతో తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News July 7, 2024

సింగరేణి కొలువులకు రాతపరీక్షలు

image

సింగరేణి సంస్థ మొత్తం 10 కేటగిరీల్లో 272 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువరించింది. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు యాజమాన్యం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. హాజరయ్యే అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది.

News July 7, 2024

KRM: బాలుడు మృతి.. బంధువుల ఆందోళన

image

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం వంతడుపులకి చెందిన అనిల్-శిరీష దంపతులు ఐదేళ్ల బాలుడు అయాన్ష్ జ్వరంతో బాధపడుతుండగా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు బాలుడికి ఇంజక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు.

News July 7, 2024

నిజామాబాద్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

నిజామాబాద్ జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విత్తనాలు, వరి నాట్లు వేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రమాదాల బారీన పడకుండా ఉండాలని హెచ్చరించారు.

News July 7, 2024

NLG: రైతు భరోసా.. మెజార్టీ రైతుల అభిప్రాయమిదే..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఆమలు చేయనున్న రైతు భరోసాను ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని జిల్లాలోని మెజారిటీ రైతులు అభిప్రాయపడ్డారు. ఒక రైతుకు అంతకుమించి భూమి ఉన్నా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని, రియల్ఎస్టేట్ వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

News July 7, 2024

ఖమ్మం: తల్లీకూతురిని కరిచిన పాము

image

తల్లీకూతురును పాము కరిచిన ఘటన నేలకొండపల్లి మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సుర్దేపల్లికి చెందిన రాధ(27), ఆమె కూతురు దీవెన (5) శుక్రవారం రాత్రి వరండాలో నేలపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో కట్ల పాము తొలుత కూతురు దీవెనను, తర్వాత రాధను కరించింది. చుట్టుపక్కల వారు వచ్చి పామును చంపారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు.

News July 7, 2024

కరీంనగర్: ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలులో విఫలం’

image

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఎన్నికల హామీలు పూర్తిగా అమలు కావడం లేదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.