India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD నగరం హెరిటేజ్ అందాలకు మారుపేరుగా నిలుస్తుంది. దేశ, విదేశాల నుంచి HYD నగరానికి తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోకాపేటలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపుగా 120 మీటర్ల ఎత్తులో ఈ హెరిటేజ్ టవర్ ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల స్విమ్మింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.హన్మంతరాజు తెలిపారు. ఇక్కడ ఎంపిక చేసే జట్టును ఈ నెల 13, 14వ తేదీల్లో సికింద్రాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ OSDగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిరిశెట్టి సంకీర్తన్ నియామకం అయ్యారు. ఆయన 2020లో IPS శిక్షణ పూర్తి చేసుకుని ములుగు, మధిర జిల్లాలకు ప్రొబెషనరీ IPSగా పని చేశారు. అనంతరం ఏటూరునాగారం ASPగా పనిచేసిన సంకీర్తన్ ఇటీవల గవర్నర్ OSDగా నియమితులయ్యారు. గవర్నర్ OSDగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయన తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

MBBS పూర్తి చేసిన మహిళ మతిస్థిమితం కోల్పోయి అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ASరావు నగర్‌కు చెందిన నిహారిక రావు(29)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. దీంతో రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకడంతో కారుపై పడి మృతి చెందింది. కేసు నమోదైంది.

MBBS పూర్తి చేసిన మహిళ మతిస్థిమితం కోల్పోయి అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ASరావు నగర్‌కు చెందిన నిహారిక రావు(29)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. దీంతో రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకడంతో కారుపై పడి మృతి చెందింది. కేసు నమోదైంది.

నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటనకు బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం నల్లమల్లలో పర్యటించి ఇక్కడ నెలకొన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (HWO) పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు TGPSC అధికారులు పేర్కొన్నారు. పేపర్-1కు 56.94% మంది, పేపర్-2కు 56.04% మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.