Telangana

News August 26, 2024

కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

image

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. మల్లెల మడుగు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పురుగులు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే స్థానిక ప్రజలు వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

WGL 25వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్సీ సారయ్య

image

WGL 25వ డివిజన్లో MLC బస్వరాజు సారయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్సీ ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని, కాంగ్రెస్‌కు కార్యకర్తలే పట్టుకొమ్మలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.

News August 26, 2024

HYD: కృష్ణుడి సేవలో స్పీకర్, మంత్రి

image

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానుడి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.

News August 26, 2024

కరీంనగర్: 118 కిలోల గంజాయి స్వాధీనం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి మత్తు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి కమిషనరేట్ పోలీసులు నడుం బిగించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కేసులు పెడుతూ, మూలాలను కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 22 కేసుల్లో 44 మందిని అరెస్టు చేశారు. రూ.35 లక్షల విలువ చేసే 118 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News August 26, 2024

కరీంనగర్: 118 కిలోల గంజాయి స్వాధీనం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి మత్తు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి కమిషనరేట్ పోలీసులు నడుం బిగించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కేసులు పెడుతూ, మూలలను కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 22 కేసుల్లో 44 మందిని అరెస్టు చేశారు. రూ.35 లక్షల విలువ చేసే 118 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News August 26, 2024

NLG: మెగా ఫ్యామిలీని కలవడానికి HYDకి మహిళ పాదయాత్ర

image

విజయవాడ సమీపంలోని నందిగామకి చెందిన రాజీ అనే మహిళ సినీ హీరో చిరంజీవి కుటుంబాన్ని కలవడానికి ఇటీవలే హైదరాబాదుకు పాదయాత్ర చేపట్టింది. సోమవారం ఆమె చిట్యాలకు చేరుకున్న సందర్భంగా శాలిగౌరారం మండలం తక్కెళ్లపాడుకు చెందిన కాంగ్రెస్ నాయకులు నరేందర్, పులిగిల్ల బాలయ్య ఆమెను పలకరించి విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు భోజనం పెట్టించారు. పాదయాత్రగా వెళుతున్న మహిళకు బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.

News August 26, 2024

సిరిసిల్ల: ఈసారి సాధారణ వర్షపాతమే!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 576.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2023-24 సంవత్సరంలో 719.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు అయింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 7 మండలాల్లో ఉంది. 60 శాతంగా నమోదైన మండలాలు 6 ఉన్నాయి.

News August 26, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలివే..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలిలా.. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాదులో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్లలో 11.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 11.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఘన్పూర్ లో 2.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా చిన్న తాండ్రపాడులో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 26, 2024

ఆదిలాబాద్: పంజా విసురుతున్న డెంగీ

image

ఉమ్మడి జిల్లాలో దగ్గు, జలుబు, ఫ్లూ, విష జ్వరాలకు తోడు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షపు నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటూ పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలని వైద్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 204 డెంగీ కేసులు నమోదయ్యాయి.

News August 26, 2024

HYDలో యాక్సిడెంట్.. మణుగూరు యువతి మృతి

image

హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరు బీటీపీఎస్‌కు చెందిన ఎస్పీఎఫ్ ఎస్సై శంకర్ రావు కూతురు ప్రసన్న మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై శంకర్ రావు తన కూతురు ప్రసన్నతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్సై శంకర్రావు గాయాలతో బయటపడగా, ప్రసన్నకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.