India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్మల నృత్యనికేతన్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక స్తోత్రం, అన్నమాచార్య కృతి, రామదాసు కృతి, సరస్వతి కీర్తన, తరంగం, పురందరదాసు కీర్తన, జయదేవ అష్టపది, పదం, మంగళ హారతి అంశాల్లో నృత్యం చేశారు. కార్యక్రమంలో హిమశ్రీ, కావ్య, రోషిత, తన్మయి, తన్విత, కీర్తియుక, శ్రీనిధి, సంజన ఉన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవి కిరణ్, ఆయన కుమారుడు మైకేల్ ఇమ్మానుయేల్ ఇద్దరూ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. రవి కిరణ్ కామేపల్లిలోని ఎంజేపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడంతో యువతకు మార్గదర్శకుడిగా నిలిచారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి, దివంగత డీ. శ్రీనివాస్ స్మృతి సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండ: అరుణాచల గిరి దేవస్థాన దర్శనానికి వెళ్లే భక్తులకి వరంగల్ వన్ డిపో నుంచి స్పెషల్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 19న ఒక బస్సు బయలుదేరుతుందని, జులై 21న మధ్యాహ్నం మరో బస్సు బయలుదేరుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. మరిన్ని వివరాల కోసం 98663 73825 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన కోయిలకొండ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. బూరుగుపల్లికి చెందిన గొల్ల మోగులయ్య, లక్ష్మయ్య గ్రామం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా పారుపల్లి వద్ద RTC బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో RTC బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

HYD కీసరలో బాలిక(14)పై <<13578768>>బహదూర్‌పుర వాసి మహేశ్(25)<<>> అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాత్ రూమ్‌కు వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో తండ్రి వెతికాడు. DCMలో అచేతన స్థితిలో ఉన్న కూతురిని చూసిన తండ్రి విలపిస్తూ వెళ్లి మహేశ్‌ను పట్టుకునేందుకు యత్నించగా అతడు వ్యాన్‌తో సహా పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

ఇంద్రవెల్లి మండలంలోని దొడంద గ్రామానికి చెందిన పంద్రా బండు(16) శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని వెతికినా ఫలితం దక్కలేదు. కాగా ఆదివారం ఉదయం పంద్రా.. స్థానికులకు బావిలో శవమై కనిపించాడు. వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు.

HYD గోల్కొండలో జగదాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేడు బోనాల నేపథ్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు జాతర నేపథ్యంలో భక్తులు మరింత పోటెత్తుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈనెల 21, 22న సికింద్రాబాద్ మహంకాళి, 28, 29 తేదీల్లో పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఈ మేరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.

Sorry, no posts matched your criteria.