Telangana

News March 23, 2024

ములుగు: పురుగు మందుతాగి వ్యక్తి ఆత్మహత్య

image

ములుగు మండల కేంద్రానికి చెందిన తోడేటి అశోక్ (32) పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రోజు పొలం వద్దకు వెళ్లిన అశోక్ పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అశోక్ మృతిచెందాడు. భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 23, 2024

MNCL: రైలు కింద పడి సింగరేణి రిటైర్డ్ కార్మికుడి సూసైడ్

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో జరిగింది. పట్టణంలోని బృందావన కాలనీకి చెందిన మాటేటి రాజయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 23, 2024

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి: కొప్పుల ఈశ్వర్

image

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రామగుండం మున్సిపల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు.

News March 23, 2024

HYD: ఆ సీటు కచ్చితంగా గెలవాలి: సీఎం రేవంత్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ మల్కాజిగిరి, మేడ్చల్ ఇన్‌ఛార్జులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఇది తన సిట్టింగ్ స్థానమని మరోసారి గుర్తుచేశారు.

News March 23, 2024

HYD: ఆ సీటు కచ్చితంగా గెలవాలి: సీఎం రేవంత్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ మల్కాజిగిరి, మేడ్చల్ ఇన్‌ఛార్జులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఇది తన సిట్టింగ్ స్థానమని మరోసారి గుర్తుచేశారు.

News March 23, 2024

భద్రాచలంలో పది కిలోల గంజాయి పట్టివేత

image

భద్రాచలం కూనవరం రోడ్డులో కారులో అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయిని శనివారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. పట్టుబడిన గంజాయి, ఫోన్లు, కారు విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ రమేష్ తెలిపారు.

News March 23, 2024

NZB: BREAKING.. నీట మునిగి ఆరో తరగతి విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. పట్టణంలోని అలీసాగర్‌లో శనివారం ఈతకు వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి మోసిన్(13) ప్రమాదవ శాత్తు నీట మునిగి మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2024

మహబూబాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా సుజాత

image

మహబూబాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా దామల్ల సుజాతను నియమించారు.  ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన తస్లీమా మహ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా సుజాత విధుల్లోకి రానున్నారు.

News March 23, 2024

MBNR: ఈత సరే.. ప్రాణాలు కూడా జాగ్రత్త మరీ!

image

వేసవి వచ్చిందంటే చాలు విద్యార్థులు వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నారు. ఈత నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నవారు ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
* ఈత నేర్చుకునే వారు సహాయకులు లేకుండా వెళ్ళవద్దు
* బావుల్లో, కొలనులో నీటి లోతును గుర్తించి దిగడం మంచిది
* ఈత నేర్చుకుంటున్న పిల్లలు నడుముకు బెండ్లు, ట్యూబ్లు, తాళ్లు వంటివి కట్టుకోవాలి.

News March 23, 2024

HYD: రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న అసోసియేషన్

image

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైయిరీ, ఐడీ, హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం HYD ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుందన్నారు.