Telangana

News July 5, 2024

HNK: అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ మంత్రి సమీక్షా సమావేశం

image

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, తదితర అంశాలను సమావేశంలో జిల్లా కలెక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించారు.

News July 5, 2024

BHPL: జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

image

భూపాలపల్లి జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోల సీనియారిటీ జాబితా అందజేయాలని జడ్పీ సీఈఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

పిట్లం: చెరువులో మృతదేహం.. అసలేం జరిగింది..?

image

చెరువులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పిట్లంలో శుక్రవారం జరిగింది. పిట్లం గ్రామానికి చెందిన చిలుక అంజవ్వ(38) గ్రామంలోని మారేడ్ చెరువు వైపు వెళ్తుండగా.. ఆమెను చూసిన కొందరు.. కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా వారు వచ్చి చూసేసరికి ఆమె చెరువులో పడి ఉంది. ఆమెను ఒడ్డుకు చేర్చగా అప్పటికే మృతి చెందింది. ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి పడిందా.. ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి వుంది.

News July 5, 2024

మెదక్: ‘ట్రాక్టర్ కేజీ వీల్స్ రోడ్లపైకి వస్తే చర్యలు’

image

జిల్లాలో ట్రాక్టర్లను కేజీ వీల్స్‌తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడపడం వల్ల దెబ్బతింటున్నాయని, కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్లపై నడిపిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి హెచ్చరించారు. ఎస్పీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని, కేజీ వీల్స్‌తో రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

News July 5, 2024

ఎల్లారెడ్డిపేట: ప్రవర్తన మార్చుకోని మహిళకు రూ.50 వేలు జరిమానా

image

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రవర్తన మార్చుకోకుండా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేల జరిమానా విధించారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆనరాశి పోచవ్వ 2023 అక్టోబర్‌లో నాటుసారా తరలిస్తూ పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట MRO ఆఫీస్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశారు. అయితే మరోసారి నాటుసారా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెకు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ CI శ్రీనివాస్ తెలిపారు.

News July 5, 2024

KNR: నిరుపయోగంగా మారుతున్న రైతువేదికలు

image

రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.

News July 5, 2024

యూకే ఎన్నికల్లో నిజామాబాదీ ఓటమి

image

UKలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6221 ఓట్లు మాత్రమే రావటంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్లి స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

News July 5, 2024

KU ఎస్సై కుమారుడికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చోటు

image

కేయూసీ పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌- స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్‌ 6వ తరగతి చదువుతున్నాడు. అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పాడు. ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు. శుక్రవారం ఈ పత్రాన్ని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా తన చేతుల మీదుగా అక్షిత్‌కు అందజేశారు.

News July 5, 2024

నల్లగొండ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 10% రాయితీ

image

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులు సూపర్ లగ్జరీ బస్సులలో అప్ అండ్ డౌన్ ఒకే సారి రిజర్వేషన్ చేయించుకుంటే బస్ ఛార్జీల నుంచి పది శాతం రాయితీనీ పొందవచ్చని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 5, 2024

మెదక్: సదరం క్యాంప్ తేదీలు విడుదల

image

మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులను గుర్తించి అర్హతగల వారికి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగానూ జులై -2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ / ఈ సేవ కేంద్రాలకు కేటాయించినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ ఈ సేవ కేంద్రం వద్ద ఆన్ లైన్‌లో స్లాటు బుక్ చేసుకొని కేటాయించిన రోజు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.