India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమ పేరుతో బాలిక(15)ను వేధించిన యువకుడి(27)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ శుక్రవారం తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈనెల 18న బాలిక ఇంటికి వెళ్లి వేధించడంతో బాలిక తల్లి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన రటపు నరహరి(55) అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి శుక్రవారం రాత్రి స్థానిక మంగళ ఘాట్ వద్ద నిద్రిస్తుండగా, గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ధర్మపురి ఎస్సై తెలిపారు.
హుజూర్‌నగర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాలీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మఠంపల్లిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కొనుగంటి నర్సిరెడ్డి విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 101 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక్క రోజే గడువు కారణంగా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు 15లోగానే నియామకాలు చేపట్టామని, ఇప్పటికే 38మందిని ఎంపిక చేశామని, ఎన్నికల తర్వాత మరోమారు నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలకు వైద్యులను భర్తీ చేస్తామని తెలిపారు.
పర్వతగిరి మండలం తురకల సోమారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంటి పెరట్లో మొరంగడ్డ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా 5-8 అంగుళాల సైజు ఉండే ఈ మొరంగడ్డ ఏకంగా 2 అడుగుల పొడవు, రెండున్నర కిలోల బరువుతో అబ్బుర పరుస్తుంది. కాగా, గత కొంతకాలంగా వెంకటేశ్వర్లు తన ఇంటి ఆవరణలో కూరగాయలను పండిస్తున్నారు. వాటితో పాటు మొరంగడ్డ నాటారు. దానిని తవ్వి చూడగా.. భారీ పరిమాణంలో ఉండటంతో ఆశ్చర్యపోయారు.
తండ్రి కోసం జైలులోకి గంజాయి పొట్లాలను విసిరి కుమారుడు జైలుపాలైన ఘటన ADB జిల్లాలో చోటుచేసుకుంది. గంజాయి కేసులో సుభాష్‌నగర్‌కు చెందిన బాబుఖాన్ జైలులో ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. కుమారుడు అర్షద్‌ఖాన్ జైలుకు వెళ్లి ములాఖత్‌లో తండ్రిని కలుసుకొని మాట్లాడాడు. అనంతరం తనతో పాటు తీసుకొచ్చిన బీడీల కట్ట, మూడు గంజాయి పొట్లాలను జైలు గోడపై నుంచి తండ్రి కోసం విసిరేశాడు. అతణ్ని అదుపులో తీసుకొని జైలుకు పంపారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు రూ.50 లక్షలు పట్టుకున్నట్లు తెలిపారు. గజ్వేల్ సీఐ సైదా, అడిషనల్ ముత్యంరాజు, సిబ్బంది ప్రత్యేక బలగాలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో పెద్ద మొత్తంలో నగదు లభించగా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ఖాతాలో రెండు మున్సిపాలిటీలు చేరాయి. నల్గొండ జిల్లాలోని హాలియా, నందిగొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఆయా చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం నెగ్గడంతో శుక్రవారం నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా కాంగ్రెస్ మద్దతుదారులే పదవులు దక్కించుకున్నారు. హాలియా నూతన ఛైర్ పర్సన్‌గా యడవెల్లి అనుపమా, నందిగొండ ఛైర్ పర్సన్‌గా అన్నపూర్ణ ఎన్నికయ్యారు.
ACB దాడులతో ఉమ్మడి WGL జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహశీల్దారును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, తొలిసారిగా KUలో ఉద్యోగిని పట్టుకున్నారు. శుక్రవారం MHBD జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఇతర పన్నుల రాయితీ చెల్లింపు మార్చి 31 వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఉమ్మడి KNR జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇప్పటివరకు సగం వాటిలో 80% వరకు పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ప్రకటించిన 90 వడ్డీ రాయితీతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. KNR నగరంలో ఇటీవల ఓ వ్యక్తి 24 ఏళ్ల పెండింగ్ బకాయిలు చెల్లించారు.
Sorry, no posts matched your criteria.