Telangana

News June 28, 2024

NLG: పంచాయతీ కార్మికుల వేతన వెతలు

image

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. నెల నెలా సరిగ్గా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ మెన్లు, ఇతర సిబ్బంది మొత్తం 2578 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు.

News June 28, 2024

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసు: సీపీ

image

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. నగరంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 45 మంది ద్విచక్ర వాహనదారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. దొంగతనాలు చేసేవారు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నట్లు సీపీ పేర్కొన్నారు.

News June 28, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ఓపెన్ అవుతుందన్నారు.

News June 28, 2024

సూర్యాపేట: వ్యక్తిపై 50 కోతుల దాడి, తీవ్ర గాయాలు

image

మఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై సుమారుగా 50 కోతులు మూకుమ్మడిగా దాడి చేయగా వ్యక్తి తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

News June 28, 2024

తప్పిపోయిన యువకుడి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలి: MLC

image

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ వారం క్రితం ఓమాన్-యూఏఈ (మస్కట్-దుబాయి)దేశాల సరిహద్దులో తప్పిపోయాడని అతని కుటుంబ సభ్యులు MLC జీవన్ రెడ్డిని శుక్రవారం కలిసి సహాయాన్ని కోరారు. ఈ మేరకు స్పందించిన MLC మస్కట్, దుబాయిలలోని భారత రాయబారులు, కేంద్ర విదేశాంగ మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయానికి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ‘X’ ద్వారా ట్వీట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 28, 2024

వరంగల్ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకురావొద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News June 28, 2024

సిరిసిల్ల: మొన్న ప్రియుడు.. ఈరోజు ప్రియురాలు మృతి

image

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. కాగా మొన్న ప్రియుడు.. ఈ రోజు ప్రియురాలు చనిపోయింది. గూడెం గ్రామానికి చెందిన <<13504961>>చందు<<>>, భాగ్యలక్ష్మి కరీంనగర్‌లోని ఓ పార్కులో ఈ నెల 24న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియుడు అక్కడే చనిపోగా.. ప్రియురాలు ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 28, 2024

MBNR: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి అవకాశం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని మదనాపురం గురుకులం ప్రిన్సిపల్ రవీందర్ తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి tgswadtr.cgg.gov.in ద్వారా జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అటు పాఠశాల మార్పు కోసం రూ.100 రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలన్నారు.

News June 28, 2024

కొండగట్టులో ఘనంగా జ్యేష్ఠాభిషేకం

image

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతకళశాలతో శ్రీ స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్, స్థానాచార్యులు కపిందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి స్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తదితరులు ఉన్నారు.

News June 28, 2024

HYD: విషాదం.. కుక్కల దాడిలో బాలుడి మృతి

image

HYD శివారులో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు పరిధి ఇస్నాపూర్‌‌లోని మహీధర వెంచర్‌లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే పటాన్‌చెరు పరిధి ముత్తంగిలో 7 నెలల చిన్నారిని కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి మృతదేహంతో పాటు గాయపడిన 7 నెలల చిన్నారిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.