India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టిఫిన్ చేస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా
ఆస్పత్రికి తరలించే లోగా మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. పాల్వంచలోని టీచర్స్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మీనారాయణ ఆదివారం ఇంట్లో టిఫిన్ చేస్తూ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలాడు. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాము కేసు నమోదు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఒకటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల లేదా కళాశాలల్లో చదివే తండ్రి లేని అనాథ ముస్లిం విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 కల్లా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98665 56876 నంబర్ను సంప్రదించాలన్నారు.

ఒకవైపు సీజనల్ వ్యాధులు పెరిగిపోతుంటే బస్తీ దవాఖానాల్లో అన్నిరకాల టెస్టులు చేయట్లేదనే రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 169 బస్తీ దవాఖానాలు ఉండగా.. యావరేజ్‌గా ఒక దవాఖానకు 100 మంది పేషెంట్స్ వస్తున్నారు. మెజారిటీ బస్తీ దవాఖానాల్లో యూరిన్ టెస్టులు చేయట్లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పలువురు పేషెంట్లు వాపోయారు.

పురుగు మందు తాగి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతోనే SI శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. NSPTలో ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, SI మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది పత్తి సాగు లక్ష్యానికి
దూరంగా ఉంది. జిల్లాలో ప్రధాన పంటల్లో వరి తర్వాత స్థానం పత్తిదే. వరి 2.83 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, పత్తి 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది పత్తి సాగు అంచనాను 2,01,834 ఎకరాలకు తగ్గించారు. అయినా ఆ లక్ష్యం మేరకు కూడా నెరవేరడం ప్రశ్నార్థకంగానే మారింది. శనివారం నాటికి 1,81,794 ఎకరాల్లో మాత్రమే సాగైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో భార్యను చంపి భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లి ఆదివారం ఇంటికి వచ్చిన భర్త లింగం.. అనుమానంతోనే భార్యను తలపై కొట్టి చంపేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా కొనసాగుతున్న కొన్ని మెడికల్ ఔషధ షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తూ రోగులను దోచుకుంటున్నారు. వీటిల్లో ఎక్కువ శాతం తక్కువ ధర ఉండే జనరిక్ మందులనే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్న తనిఖీలు చేయాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

22 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతూ, చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న తమను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ యూరోపియన్ స్కీం ఏఎన్ఎంలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా 2002లో రూ.3.550 వేతనంతో విధుల్లో చేరారు. ఉమ్మడి జిల్లాలో 73 మంది ఈసీ ఏఎన్ఎంలుగా కొనసాగుతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

T.I.M.S నుంచి డిప్యూటేషన్లపై ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, సరోజినీ, E.N.Tకి వెళ్లిన నర్సింగ్ సిబ్బందికి 4 నెలలు గడుస్తున్నా జీతాలు లేవని వారు వాపోతున్నారు. తాము జీతాలు లేకుండా ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు.

T.I.M.S నుంచి డిప్యూటేషన్లపై ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, సరోజినీ, E.N.Tకి వెళ్లిన నర్సింగ్ సిబ్బందికి 4 నెలలు గడుస్తున్నా జీతాలు లేవని వారు వాపోతున్నారు. తాము జీతాలు లేకుండా ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.