Telangana

News July 6, 2024

నిజామాబాద్‌లో నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన

image

ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించి శనివారం తొలివిడత ధ్రువపత్రాల పరిశీలన నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ సమన్వయకర్త శ్రీరాంకుమార్ తెలిపారు. ఈ నెల 13వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఈనెల 12 వరకు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఈ నెల 8 నుంచి 10 వరకు వెబ్ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

News July 6, 2024

సూర్యాపేట: బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి 

image

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ స్టేజి సమీపంలో 365వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. పెదనేమిలకి చెందిన తన్నీరు సత్తయ్య మృతి చెందాడు. బైక్‌పై సూర్యాపేట నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో నిద్రమత్తులో డివైడర్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్తయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News July 6, 2024

MBNR: కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే.?

image

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయమైన సమాచారం. శనివారం హైదరాబాదులోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నడిగడ్డ‌లోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్లారు. గత 2 నెలలుగా నడిగడ్డలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో తెరపడనుంది.

News July 6, 2024

సిద్దిపేట: క్షణికావేశంలో ముగ్గురి ఆత్మహత్య

image

క్షణికావేశంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు మందలిచండంతో రాయపోల్ మండలం ఎల్కల్‌కు చెందిన రాజు(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన జాల యాదయ్య(56) చేసిన అప్పులు తీరక సూసైడ్ చేసుకోగా.. అక్కన్నపేటకు చెందిన తంగళ్లపల్లి సాగర్(23)వ్యక్తిగత కారణాలతో ఉరేసుకున్నాడు.

News July 6, 2024

HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్: మంత్రులు

image

HYD హైటెక్స్‌ ప్రాంగణంలో 73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌పోకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. రోల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మా ఫర్‌ గ్లోబల్‌ వెల్‌బీయింగ్‌ నేపథ్యంతో 3 రోజుల పాటు సదస్సు జరగనుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్ అని మంత్రులు అన్నారు.

శిథిలావస్థకు చేరిన సర్వాయి పాపన్న కోట గోడలు!

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో సర్ధార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటతో పాటు గోడలు శిథిలావస్థకు చేరి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన కోటను సంరక్షించేందుకు గతంలో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వానలకు కోట గోడలు శిథిలమై కూలుతున్నాయి. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న కోటకు అధికారులు మరమ్మతులు చేపట్టి సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 6, 2024

గోల్కొండ బోనాలకు జలమండలి నీటి సరఫరా

image

HYD గోల్కొండ బోనాలను పురస్కరించుకొని జలమండలి తాగునీటి కోసం ఏర్పాట్లు చేసింది. కోట ప్రారంభంలోని మెట్ల దగ్గరి నుంచి బోనాలు జరిగే ప్రాంతం వరకు తాగునీటి పాయింట్లను ఏర్పాటు చేసింది. డ్రమ్ములు, ట్యాంకులు, పంపులు అందుబాటులోకి తెచ్చింది. వంటలు చేసే ప్రాంతంలో స్టాండ్లను కూడా సిద్ధం చేసింది. పైపులైన్ ద్వారా తాగునీరు అందించేందుకు ట్రయల్ రన్‌ను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం

image

జిల్లాలోని నవీపేట మండలం కమలాపూర్, మోకన్ పల్లి శివారులో శుక్రవారం చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన గాంధీ తన మేకలను తీసుకొని గుట్టకు వెళ్లాడు. సాయంత్రం చిరుత తన మందపై దాడి చేసినట్లు రైతు పేర్కొన్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో NZB బీట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ జహుర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరత సంచారం నిజమేనని వెల్లడించారు.