India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సికింద్రాబాద్ MCEME వద్ద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TES-41, B.Tech కోర్సు పూర్తి చేసిన ఆర్మీ అధికారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీలంక, భూటాన్ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అధికారులు సైతం ఉన్నట్లు డాక్టర్ రమేశ్ కంచర్ల తెలియజేశారు. ఉద్యోగంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అధికారులన్నారు.

వరంగల్ NITలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్య్వూల్లో బీటెక్ (ECE) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, క్లబ్‌ల నుంచి అందిన మార్గదర్శకత్వం తనకు తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది రూ.68 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు లభించగా, 82 శాతం మంది బీటెక్ విద్యార్థులు ఉద్యోగం సాధించారు.

మండల పరిషత్‌లకు గురువారం, జిల్లా పరిషత్‌లకు శుక్రవారం గడువు ముగుస్తోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని నల్లగొండ జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ లకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక పాలన అధికారిని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్విభజన చేశారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు, ఉద్యోగులకు సబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

ఖమ్మం జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలకు గాను 96 టీచర్ల పోస్టులు, 395 ఆయాల పోస్టులు గతంలోనే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయిన వారితో కలిపితే 117 టీచర్, 599 ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సమీక్షలో ఉన్నతాధికారులు వెల్లడించారని జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్ రెడ్డి తెలిపారు.

సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 7 డిపోల్లో సుమారు 1,818 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు.

ACB అధికారుల దాడితో పరారైన రాయికల్ SI అజయ్ ఆచూకీ లభించలేదు. సదరు SI జూన్ 11న పట్టుకున్న ఇసుక ట్రాక్టరు విడిపించేందుకు బాధితుడు రాజేందర్ రెడ్డిని డబ్బులు డిమాండ్ చేయగా ఆయన ACBని ఆశ్రయించాడు. ఇటిక్యాలకు చెందిన మధ్యవర్తి రాజుకు రాజేందర్‌రెడ్డి రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అధికారుల రాకతో పారిపోయిన SI 13 రోజులుగా పరారీలోనే ఉన్నారు. SI ఆచూకీ కోసం ACB అధికారులు గాలిస్తున్నారు.

నిలోఫర్ ఆసుపత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్ బ్లాక్, డయాగ్నొస్టిక్ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్ సర్జికల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూ లాక్టేషన్ మేనేజ్‌మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ పరిశీలించారు.

Sorry, no posts matched your criteria.