Telangana

News July 4, 2024

మంచిర్యాల ఆసుపత్రిలో పవర్ కట్.. స్పందించిన హరీశ్ రావు

image

మంచిర్యాల MCH ఆసుపత్రిలో బుధవారం రాత్రి <<13562300>>కరెంట్ కట్ <<>>అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాత్రంత కరెంట్ లేకపోవడంతో బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

News July 4, 2024

మూడు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి: తీన్మార్ మల్లన్న

image

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

News July 4, 2024

ALERT: EAMCET(ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

image

TS EAMCET -2024( ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(JULY4) నుండి ప్రారంభం కాగా… JULY 12 వరకు ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలదు.
✓JULY6 నుండి 13 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
✓JULY 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక
✓JULY 19 మొదటి విడత సీట్ల కేటాయింపు
వెబ్సైట్: https://tgeapcet.nic.in
#SHARE IT

News July 4, 2024

KMM: ఆర్టీసీలో కొలువుల జాతర, తగ్గనున్న భారం

image

సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 డిపోల్లో సుమారు 2,115, మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు

News July 4, 2024

మూడు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

image

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

News July 4, 2024

HYD: మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

image

మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంగళరావునగర్‌లోని ఓ స్థిరాస్తి సంస్థలో దేవేందర్ యాదవ్(55)తోపాటు మరో మహిళ(45) ఉద్యోగం చేస్తోంది. మహిళకు సంబంధించిన వ్యక్తిగత చిత్రాలను దేవేందర్ యాదవ్ తన సెల్‌ఫోన్‌లో తీసి పెట్టుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆమె ఉద్యోగం మానేసింది. దీంతో దేవేందర్ ఆమెకు ఫోన్ చేసి కోరిక తీర్చాలని వేధించగా.. జూబ్లీహిల్స్ PSలో ఆమె ఫిర్యాదు చేసింది.

పటాన్‌చెరు: లింక్ క్లిక్ చేస్తే రూ.14 లక్షలు మాయం

image

పటాన్‌చెరు పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.14 లక్షలు పోగొట్టుకుంది. ఆన్‌లైన్ పెట్టుబడులపై ఆమె ఆసక్తి చూపించగా సైబర్ కేటుగాళ్లు మొదట్లో లాభాలు చూపించారు. దాంతో ఆమె పెట్టుబడులు పెట్టారు. లింకు పంపిస్తున్నాం క్లిక్ చేయండి నగదు క్రెడిట్ అవుతాయని నమ్మించారు. అది నమ్మి క్లిక్ చేయడంతో ఆమె ఖాతాలో ఉన్న రూ. 14 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

News July 4, 2024

HYD: కూకట్‌పల్లిలో కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీ

image

నగరంలోని పలు ప్రాంతాల్లో GHMC కమిషనర్ ఆమ్రపాలి శానిటేషన్‌పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, మూసాపేట్, భరత్ నగర్‌లోని రైతుబజార్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. GVP తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.