India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 58 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి.రాంబాబు, రఘువరన్ ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో డయేరియా ప్రబలకుండా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్‌లో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఇతర జిల్లా అధికారులతో కలసి డయేరియా అవగాహన కార్యక్రమాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు.

పటాన్‌చెరు మండలం లక్డారం వాసికి జులై 1న ఓ వ్యక్తి ఈడి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మనీ లాండరింగ్ కేసు నమోదు అయ్యిందని బెదిరించాడు. విచారిస్తున్నామని ఆధార్, బ్యాంకు వివరాలు తెలపాలన్నారు. ఈ క్రమంలో ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పడంతో రూ.3 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

రాపిడో బాయ్‌పై దాడిచేసి గాయపరిచిన ఇద్దరిపై కేసు నమోదయింది. ఆదివారం ములుగు రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్ రాపిడో బుక్ చేసుకున్నాడు. రాపిడో బాయ్ సిద్దంశెట్టి కృష్ణంరాజు లోకేషన్ చేరుకున్నాడు. కృష్ణంరాజు లేట్ అవుతోంది తొందరగా రండి అన్నాడు. దానికి కొపగించుకున్న శేఖర్, రమణాచారితో కలిసి అతనిపై దాడిచేశారు. బాధితుడు సోమవారం హన్మకొండ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

NGKL: స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలను రూపొందించి వాట్సాప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణ ప్రచార గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్‌గా పోలీసులు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాలేజీలో నిర్మాణమవుతున్న కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.

తిట్లు, ఆరోపణలు బంద్ చేసి.. అభివృద్ధిపై ఫోకస్ పెడదామని హోంశాఖ సహాయకమంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని, కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలైపోయినయ్.. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని ఆయన హితవు పలికారు.

భువనగిరిలోని భాగాయత్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి సినీ నటి మంచు లక్ష్మీ సోమవారం ప్రారంభించారు. స్మార్ట్ క్లాస్ రూమ్‌లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బోడకుంట హరికృష్ణ(24) శనివారం రోజున లక్షట్టిపేట గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.