Telangana

News August 26, 2024

MNCL: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

NZB: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు!

image

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ఊరించినప్పటికి, జిల్లాలో కనీసం 1000 మంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించలేదు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి 8 మాసాలు గడవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా జిల్లా వ్యాప్తంగా 1,85,404 దరఖాస్తుల వచ్చాయి. మొదటి విడతలో జిల్లాకు 10,500 ఇళ్లను కేటాయించారు.

News August 26, 2024

‘HYDRA తగ్గేదేలే.. మా దగ్గర కూల్చేయండి’

image

HYD మహానగరంలో HYDRA దూకుడుపై సోషల్ మీడియా వేదికగా AI ఉపయోగించి రూపొందించిన పలు చిత్రాలు వైరల్ అవుతున్నాయి. HYDRA అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోందని, మా ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులకు కోకొల్లలుగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులోనే భవన నిర్మాణాలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయని పలువురు ఆరోపించారు.

News August 26, 2024

జూరాలకు భారీగా వరద.. 25 గేట్లు ఓపెన్

image

జూరాలకు భారీ వరద మరోసారి పోటెత్తడంతో డ్యాం 25 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1.10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 25 గేట్ల ద్వారా 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నెల వ్యవధిలోనే ప్రాజెక్టుకు వరద రెండోసారి పోటెత్తిందని అధికారులు తెలిపారు. దీంతో కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 26, 2024

మెదక్: రైతుపై ఎలుగుబంటి దాడి

image

మెదక్ జిల్లాలో రైతులపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయ పరిచిన ఘటన ఈ ఉదయం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హవేలీఘనాపూర్ మండలం వాడి గ్రామ పంచాయతీలోని దూప్ సింగ్ తండా చెందిన రవి.. గ్రామ శివారులోని తన పొలానికి నీరు పెడుతున్నారు. ఈ క్రంలో పక్కన ఉన్న చెరకు తోటలో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వెంటనే రవిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

HYD: రేపు ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

image

ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరసనకు పిలుపునిచ్చింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఉద్యోగులను కోరింది. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌లతో నిరసన వ్యక్తం చేస్తామని జేఏసీ తెలిపింది.

News August 26, 2024

HYD: రేపు ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

image

ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరసనకు పిలుపునిచ్చింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఉద్యోగులను కోరింది. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌లతో నిరసన వ్యక్తం చేస్తామని జేఏసీ తెలిపింది.

News August 26, 2024

ఐఐటీ హైదరాబాద్‌లో జపాన్ కెరియర్ డే-2024 వేడుకలు

image

ఐఐటీ హైదరాబాద్ లో జపాన్ కెరియర్ డే-2024 వేడుకల్ని నిర్వహించారు. జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో ) ఆధ్వర్యంలో 2018 నుంచి ఏటా ఈ కార్యక్రమం ఒక రోజు నిర్వహిస్తున్నారు. జపాన్ కు చెందిన 18 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెట్రో డైరెక్టర్ జనరల్(బెంగళూరు) తొషిరో మిజుతాని మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థులకు జపాన్ లో అధిక అవకాశాలు ఉన్నాయన్నారు.

News August 26, 2024

MBNR: LRS దరఖాస్తులు.. రూ. 3కోట్ల ఆదాయం

image

డీటీసీపీ లేఅవుట్ లేకుండా వెంచర్లు చేసి విక్రయించిన పాటను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు 2020 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 1.94లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి మూడు కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయా మున్సిపాలిటీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన నత్త నడిపిన సాగుతుంది. పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.