India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హన్మకొండలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు నాలుగవ రోజు అమ్మవారికి 10,008 గాజులతో, వివిధ రకాల పూలతో, కూరగాయలతో అలంకరించారు. అలాగే భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ల జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో ఇద్దరు వికారాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. ముగ్గురు రంగారెడ్డి జిల్లా వారున్నారు. మేడ్చల్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. తొలి విడతలో పదవులు దక్కని వారంతా రెండో జాబితాలోనైనా తన పేరు వస్తుందని ఆశతో ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో భూ వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. భూ వివాదం పరిష్కారం గాక, భూమిని దున్నుకోలేక , ఇతరుల చెరలో ఉన్న భూమిని విడిపించుకోలేక ఆత్మహత్య చేసుకుంటేనో లేదా ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే తప్ప పరిష్కార మార్గం దొరకదన్న భావన బలపడుతుండడం అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో జిల్లాలో వరుస ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై అధికారులు రైతంగానికి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బండ్లగూడ మార్క్స్ నగర్‌లో ఒడిశాకు చెందిన సరోజ్ కుమార్(40) సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాడు. అతను గంజాయికి బానిసై ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.27,500 విలువ గల 1,100 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్సీపురం పోలీసులు తెలిపారు.

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మంగినపల్లి నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో “డ్రోన్ వ్యవసాయ రసాయన పిచికారి” యంత్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని విద్యగా ఎంచుకోవడం దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసినప్పటికీ వారికి గౌరవ వేతనం అందలేదు. ZPTC, MPP, MPTC 8నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. 2023 అక్టోబరు వరకు వేతనాలు అందాయి. ఆ తర్వాత వీరికి వేతనం అందలేదు. ఈనెల 3న MPPలు, MPTCల పదవీ కాలం ముగియగా, 4న జడ్పీ ఛైర్‌పర్సన్, ZPTCల పదవీ కాలం ముగిసింది. ZP ఛైర్‌పర్సన్‌కు నెలకు రూ. లక్ష, ZPTCలకు రూ.13 వేలు, MPTCలకు రూ.6,500 వేతనం ఉంది.

హిస్టరీ జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్‌ను కామారెడ్డి వాసి సాధించారు. గాంధారీ మండలం నేరాల్ తండా గ్రామానికి చెందిన బర్దావల్ మేఘరాజ్ నాయక్ జూనియర్ లెక్చరర్‌గా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. మారుమూల తండాలో పుట్టిన కాయితి లబాన్ బర్దావల్ మేఘరాజ్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో గ్రామస్థులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 కార్పొరేషన్లకు ప్రభుత్వం సోమవారం ఛైర్మన్లను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు కార్పొరేషన్ ఛైర్మన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా నుంచి కుడా ఛైర్మన్‌గా వెంకట్రామిరెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా పొదెం వీరయ్య, అయిత ప్రకాశ్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, మహమ్మద్ రియాజ్, బెల్లయ్యనాయక్‌లకు అవకాశం దక్కింది.

విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో డిప్యూటీ సీఎంకు మరియు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎ, మంత్రులను ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.