India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో RPF SI అంటూ నార్కెట్‌పల్లి యువతి మాళవిక అందరినీ నమ్మించగా ఆమెను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజంగా SIలానే ఆమె చేసేదని స్థానికులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసులకు వెళ్లి స్పీచ్‌లు ఇస్తూ SIలానే ప్రవర్తించేదని చెప్పారు. ఏడాదిగా నకిలీ పోలీస్ యూనిఫాం వేసుకుని తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పొలం గట్టుపై విద్యుత్ తీగలు పడ్డాయి. బుధవారం ఉదయం రైతు పొలం పనులకు వెళ్ళగా.. విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
GWMC కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రెవెన్యూ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పన్ను వసూళ్ల పురోగతిపై సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు సూచనలు చేశారు. 2023- 24 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.97.66 కోట్లు కాగా ఇప్పటికి రూ.63.96 కోట్ల సేకరణ జరిగిందన్నారు. RIల వారీగా వసూళ్ల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం తగదన్నారు.
ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైంది. కాగా మెదక్, జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS-8, కాంగ్రెస్- 5, BJP- 1 చోట విజయం సాధించాయి. కామారెడ్డిలో గెలిచిన బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.
HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై ప్రభుత్వ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నెక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ విల్లాలు, దుండిగల్ ఓ ఇంజినీరింగ్ కాలేజీ కూల్చివేత, బోడుప్పల్, ఘట్‌కేసర్, బండ్లగూడ జాగీర్, ఎల్బీనగర్, కీసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను ఇటీవల నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణం కనిపిస్తే కూల్చివేస్తామని GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.
HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై ప్రభుత్వ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నెక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ విల్లాలు, దుండిగల్ ఓ ఇంజినీరింగ్ కాలేజీ కూల్చివేత, బోడుప్పల్, ఘట్‌కేసర్, బండ్లగూడ జాగీర్, ఎల్బీనగర్, కీసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను ఇటీవల నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణం కనిపిస్తే కూల్చివేస్తామని GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో కారు బీభత్సం సృష్టించింది. భట్లపల్లి గ్రామంలో అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలైయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బుధవారం హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేశారు. ఈ నెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు.
BJP మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముమ్మడి ప్రేమ్‌కుమర్ ప్రకటించారు. ఈరోజు ఈటలను ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. BJP అభ్యర్థి ఈటలను గెలిపించేందుకు జనసేన కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. BJP, జనసేన శ్రేణులు కలిసి ఈటలను తప్పకుండా గెలిపిస్తాయన్నారు.
Sorry, no posts matched your criteria.