India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహం నీటిలో కొట్టుకెళ్తుండగా స్థానిక గొర్రెల కాపర్లు చూసి పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేసవికాలం వేళ HYDలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెలలో 5న సరాసరిగా 52.15 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఒక రోజుకు 70.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.

బాల్కొండ మండల పరిధిలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు వెళ్తున్న రోహిత్ కుమార్ బైక్ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు చెప్పారు.
నారాయణపేట జిల్లాకు చెందిన రవి కుమార్ 4/400 మీటర్ల రిలే పరుగులో గోల్డ్ మెడల్ సాధించాడు. చండీగఢ్‌లో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని అసమాన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన రవిని అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, మిత్రులు అభినందించారు.
హైదరాబాద్ శివారులో బుధవారం విషాదఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

HYD, RR, MDCL పరిధిలో కుక్కల బెడదతో గల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట, షేక్‌పేట, రాజేంద్రనగర్, అద్రాస్‌పల్లి, ఉప్పల్ లాంటి అనేక చోట్ల కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. ఇప్పటికీ ఎల్బీనగర్-24385, చార్మినార్-37666, ఖైరతాబాద్-8178, శేర్లింగంపల్లి-1813, కూకట్‌పల్లి-6901, సికింద్రాబాద్‌లో 18086 కుక్కలకు స్టెరిలైజేషన్ కాలేదు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, ఖమ్మం రూరల్ పోలీసుల ఆద్వర్యంలో వివిధ ప్రాంతాలలోని సెంట్రల్ పోలీస్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. నగదు మద్యం రవాణాను చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జలగం వెంకటరావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తామని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందని.. అందుకే పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.