Telangana

News March 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పోలీసులు తనిఖీలు
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనకయ్య పర్యటన

News March 20, 2024

తాగునీటి ఇబ్బందులు ఎదురుకావొద్దు : కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన ఎంపీడీఓలు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్షించారు. జలాశయాల్లో నీటిమట్టం పడిపోతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. బోర్ల మరమ్మతు, ఫ్లషింగ్ చేయించడమే కాక ప్రైవేట్ బావులు, బోర్లను లీజ్కు తీసుకోవాలని సూచించారు.

News March 20, 2024

మెడికల్ కాలేజీలో 38 వైద్యుల పోస్టులు భర్తీ

image

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 38 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజేశ్వరరావు తెలిపారు. ఇందులో 32 మంది మంగళవారం విధుల్లో చేరారని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 15న జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నియామకాలతో కొంత మేర వైద్యుల కొరత తీరినట్లేనని, ఎన్నికలు ముగిశాక పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామన్నారు.

News March 20, 2024

HYD: లవ్‌లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి

image

HYD శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) <<12882624>>హత్య కేసు మిస్టరీ<<>> వీడింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. అమ్మాయి తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తె తీరు‌ను జీర్ణించుకోలేక కోపంతో కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 20, 2024

HYD: లవ్‌లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి

image

HYD శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) <<12882624>>హత్య కేసు మిస్టరీ<<>> వీడింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. అమ్మాయి తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తె తీరు‌ను జీర్ణించుకోలేక కోపంతో కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 20, 2024

ఖమ్మంలో మొదలైన రాజకీయ సందడి

image

ఉమ్మడి ఖమ్మంలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ ఖాతా తెరవలేదు. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైన గెలవాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

యువతిపై భువనగిరి యువకుడి అత్యాచారం

image

యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. SI చింత రాజు ప్రకారం.. భువనగిరి జిల్లాకు చెందిన సిద్దారెడ్డి కొన్ని నెలలుగా మండలంలోని ఓ గ్రామంలో తన అక్క వద్ద ఉంటూ.. పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(19)పై మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐపీసీ 452, 376 ప్రకారం యువకుడిపై కేసు నమోదైంది.

News March 20, 2024

ఇబ్రహీంపట్నం: మాజీ భర్తపై యాసిడ్‌తో దాడి

image

మాజీ భర్తపై యాసిడ్ దాడి జరిగిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. ఎస్సై అనిల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేశ్‌కు, మెట్‌పల్లికి మండలానికి చెందిన మాస లక్షణతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో మహేశ్ మరో పెళ్లికి సిద్ధమవుతుండగా.. మంగళవారం లక్షణ, మహేశ్‌ ఇంటికెళ్లి అతనిపై యాసిడ్ దాడి చేసింది. దీంతో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

News March 20, 2024

జనగామ: యువతిపై అత్యాచారం

image

యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకొంది. SI చింత రాజు ప్రకారం.. భువనగిరి జిల్లాకు చెందిన సిద్దారెడ్డి కొన్ని నెలలుగా మండలంలోని ఓ గ్రామంలో తన అక్క వద్దనే ఉంటూ.. పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(19)పై మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐపీసీ 452, 376 ప్రకారం యువకుడిపై కేసు నమోదయింది.

News March 20, 2024

ADB: హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్‌కు

image

ఒకరిపై కత్తితో దాడిచేసి కేసులో ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోలిపూరకు చెందిన మునీర్ బేగ్‌పై సోమవారం రాత్రి 11 గంటలకు కేఆర్కే కాలనీకి చెందిన షేక్ షాబాద్, సయ్యద్ రెహాన్ హష్మీ కత్తితో దాడితో చేశారు. బాధితుడి తల్లి గులాబ్ బీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.