Telangana

News August 26, 2024

HYDRA..తగ్గిదిలే..మా దగ్గర కూల్చేయండి..AI ఫోటో వైరల్

image

HYD మహానగరంలో HYDRA దూకుడు పై సోషల్ మీడియా వేదికగా AI ఉపయోగించి రూపొందించిన పలు చిత్రాలు వైరల్ అవుతున్నాయి. HYDRA అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోందని, మా ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వెంటనే చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి, ఇతర శాఖల అధికారులకు కోకొల్లలుగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులోనే భవన నిర్మాణాలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయని పలువురు ఆరోపించారు.

News August 26, 2024

‘ORR లోపల GHMC.. వెలుపల మున్సిపాలిటీలు’

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఔటర్ రింగురోడ్డు వరకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓఆర్ఆర్ పరిధిలోని 28 గ్రామాలతో పాటు, ఆర్ఆర్ జిల్లాలోని పలు గ్రామాలు జిహెచ్ఎంసి పరిధిలోకి వెళ్లనున్నాయి. ORR బయట ఉన్న గ్రామాలతో నూతన మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

News August 26, 2024

పార్కింగ్‌లో వాహనాలకు రక్షణ ఏదీ..?

image

అలంపూర్ పుణ్యక్షేత్రంలోని పార్కింగ్‌లోని వాహనాలకు రక్షణ కరువైంది. పార్కింగ్ వేలం ద్వారా సంబంధిత ఆలయానికి సుమారు అరకోటి ఆదాయం వస్తున్నా.. వాహనాలకు నిలువు నీడ లేకుండా పోయింది. అదేవిధంగా గుత్తేదారుల వాహనాల దగ్గర టికెట్లు తీసుకొని వాహనాలను లోపలికి పంపిస్తున్నారే తప్పా, క్రమ పద్ధతిలో వాహనాలు పెట్టించడం లేదు. దీంతో ఒక వాహనానికి మరొక వాహనం తగులుతూ వాహనదారు తరచూ ఘర్షణకు దిగుతున్నారు.

News August 26, 2024

హైడ్రా వెనుక ఎలాంటి కుట్ర లేదు: బిక్షపతి గౌడ్

image

MLG: హైడ్రా వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ అన్నారు. ములుగులో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా తరహాలో ములుగులో భూ-కబ్జాలపై ఉక్కు పాదం మోపాలని, ప్రభుత్వ భూములను సంరక్షించి భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

News August 26, 2024

HYD: రాష్ట్ర స్పీకర్ X అకౌంట్ హ్యాక్..!

image

తెలంగాణ రాష్ట్ర స్పీకర్, VKB అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ (X) హ్యాండిల్ హాక్ అయింది. దీనిపై స్పీకర్ స్పందిస్తూ..మీకు ఎలాంటి సందేశాలు వచ్చినా, వ్యంగ్యమైన పోస్టులు షేర్ చేసినా మీరు ఎవ్వరు పట్టించుకోకండి.
నేను నా X టెక్నికల్ టీంతో మాట్లాడి తిరిగి అకౌంట్ రికవరీ చేయించాను. ఇకపై యథావిధిగా ఎక్స్ అకౌంట్లో మా అప్డేట్స్ చూడగలరు అని స్పీకర్ అన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహుల ఎదురుచూపు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియగా, నాటి నుంచి గ్రామ సచివాలయాల పరిపాలన ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళింది. లోకసభ ఎన్నికలు పూర్తికాగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అందరూ ఊహించారు. అయితే బిసి జనాభా బీసీ గణన పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహిస్తారని సంకేతాలు రావడంతో ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. 

News August 26, 2024

HYD: తండ్రి ముందే కూతురు మృతి

image

తండ్రి ముందే కూతురు మృతి చెందిన విషాదఘటన హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరుకు చెందిన SPF SI శంకర్ రావు తన కుతూరిని బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వారి బైక్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంగారెడ్డి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం

image

ప్రధానమంత్రి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న ప్రతిభావంతులు అర్హులని చెప్పారు. పిల్లల రక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31లోగా http@awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.