Telangana

News July 2, 2024

వరంగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు ఏఎస్పీల బదిలీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ బాబాసాహెబ్ ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. జనగామ ఏఎస్పీ అంకిత్ కుమార్ శంకవార్ భద్రాచలంకు, గ్రేహౌండ్స్ నుంచి శివమ్ ఉపాధ్యాయ ఏటూరునాగారం ఏఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 1, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవద్దని నిరసన
✓సికింద్రాబాద్: మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగుల నిరసన నే ✓సికింద్రాబాద్: గాంధీలో టెన్షన్.. ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్
✓NEET అంశం పై నిరసన.. ఎమ్మెల్సీ వెంకట్ అరెస్ట్
✓HYD: మోతిలాల్ నాయక్‌కు మద్దతుగా OUలో నిరసన
✓నార్సింగి: ఇంజినీర్ హత్యలో రిలేషన్ కోణం
✓అన్ని GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి

News July 1, 2024

HYD: బ్యాంక్ ఛైర్మన్ బాత్‌రూమ్‌లో ఉద్యోగి సూసైడ్

image

నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కో-అపరిటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ 3వ అంతస్థులో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్‌కు చెందిన నాలుగవ తరగతి ఉద్యోగి ఓంకార్ ఛైర్మన్ బాత్ రూమ్ కిటికీకి ఉరివేసుకుని బలవణ్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో పలు వార్డులను పరిశీలించిన కలెక్టర్. @ పెద్దపల్లిలో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి. @ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు సస్పెండ్. @ కరీంనగర్ ప్రజావాణి కి 370, జగిత్యాల ప్రజావాణికి 44 ఫిర్యాదులు. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ కథలాపూర్ మండలంలో బైక్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డాక్టర్స్ డే.

News July 1, 2024

కొడంగల్: పురుగు మందు తాగి బాలుడు ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా పురుగుమందు తాగి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంటకు వెంకటేష్ (16) చదువు మధ్యలోనే వదిలేశాడు. కాగా అతను కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్దామని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లిన బాలుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కొడంగల్ ఎస్సై భరత్ కుమార్ రెడ్డి చెప్పారు.

News July 1, 2024

బూర్గుపల్లి: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

image

ఇంట్లో దూలానికి ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలి ఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మరెల్లి ఆనంద్ రాజ్ (28) తన ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

మంచిర్యాల: స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

image

2024-2025 సంవత్సరానికి స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాల ఎంపిక కొరకు ఈ నెల 3, 4 తేదీల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి కీర్తి రాజవీర్ తెలిపారు. ఓయూ క్యాంపస్, హన్మకొండ, ఖమ్మం, వనపర్తి, సరూర్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అకాడమీల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 1, 2024

బిక్కనూర్‌లో బాలిక ఆత్మహత్య

image

బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన హరిబాబు కుమార్తె సాయి(15) సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు SI సాయికుమార్ తెలిపారు. మతిస్తిమితం బాగా లేక గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరేసుకున్నట్లు వెల్లడించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News July 1, 2024

కథలాపూర్: బైక్ ఇవ్వలేదని విద్యార్థి సూసైడ్

image

బైక్ ఇవ్వలేదని విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన కథలాపూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పోసానిపేటకు చెందిన మారు మణిదీప్ (14) జూన్ 24న స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడగ్గా ఆమె ఒప్పుకోలేదు. దీంతో అతను గడ్డిమందు తాగాడు. అతనిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 1, 2024

రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండు: కేటీఆర్

image

రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాలలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని పార్టీ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను దమ్ముంటే పదవికి రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు. ప్రజలు అప్పుడు తేలుస్తారని చెప్పారు.