India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 7వ తేదీ నుంచి మొదలు కానున్న ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయాన్ని కలెక్టర్ సీపీతో కలిసి సందర్శించారు. రేపు కోటలో తొలి పూజ ప్రారంభమవుతున్నందున ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

ఈనెల 7వ తేదీ నుంచి మొదలు కానున్న ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయాన్ని కలెక్టర్ సీపీతో కలిసి సందర్శించారు. రేపు కోటలో తొలి పూజ ప్రారంభమవుతున్నందున ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజువారీగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య సగటున 30గా నమోదవుతోంది. రేబిస్ కారణంగా ఏటా 500-600 గేదెలు, ఆవులు తదితర పశువులు మృత్యువాత పడుతున్నాయి. కుక్కలు, పిల్లులు కరిస్తే పది నిమిషాల్లోపు ఆప్రాంతంలో నురగ వచ్చే వరకు సబ్బుతో ఎక్కువసార్లు శుభ్రపరచాలి. అప్రమత్తంగా లేకపోతే వీటి నుంచి సంక్రమించే వ్యాధులతో మనుషుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 124 ఎత్తిపోతల పథకాల కింద 32,880 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 74 ఎత్తిపోతల పథకాలు సాగునీరందిస్తున్నాయి. 50 లిఫ్టులు పూర్తిగా పడకేశాయి. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ఉభయ జిల్లాల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరైనా పనులు జాప్యమవటంతో ఈ సీజన్కు సాగునీరందే పరిస్థితి లేకుండా పోయింది.

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సుమారు గంటపాటు నిలిచిపోయింది. చక్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైలును నిలిపేశారు. సిబ్బంది సమస్యను గుర్తించి మరమ్మతులు చేపట్టారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు వానాకాలం సాగుకు ఊతమిస్తున్నాయి. వేసిన పంటలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పుడమి తల్లి పచ్చదనంతో మురిసిపోతుంది. దాదాపు ఎండిపోయే స్థితిలో ఉన్న పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రాణం పోస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న, వరి నారుమళ్లు ఇలా వానాకాలం సాగు ఆరంభంలో వేసిన పొలాలన్నీ పచ్చదనంతో మెరుస్తున్నాయి.

విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్రి రేణుక (38) శుక్రవారం ఇంటి ఆవరణలో శుభ్రం చేస్తోంది. తెగిపడిన కరెంట్ వైర్ తగిలి షాక్‌కు గురైంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలను గోదావరిలో తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాసర ఎస్ఐ గణేశ్ వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన సారయ్య- సత్తమ్మ భార్యాభర్తలు. వీరి ఇద్దరి మధ్య 2010లో చిన్న గొడవ జరగగా సత్తమ్మ మృతి చెందింది. దీంతో సారయ్య 14 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు. ఇద్దరు పిల్లలు అనాథశ్రమంలో చేరారు. సారయ్య సత్ప్రవర్తన కింద ఈ నెల 3న విడుదలయ్యాడు. అనాథశ్రమంలో ఉన్న పిల్లలను కలిశాడు. పిల్లలను తన వెంట తీసుకెళ్తానని తెలపడంతో ఆశ్రమ నిర్వాహకులు కంటనీరు పెట్టి తండ్రితో పంపించారు.

గ్రేటర్ HYDలో GHMC ఫుడ్ సేఫ్టీ బృందం శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లోని రోడ్ సైడ్ షాపుల్లో టీ పొడిలో క్యాన్సర్‌కు కారణమయ్యే కలర్లు వాడుతున్నట్లు దాడుల్లో బయటపడిందన్నారు.స్ట్రీట్ ఫుడ్‌లో వాడే మసాలాలు, సాస్‌లు అన్నింటిలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు తేలిందని, FSSAIమొబైల్ ల్యాబ్ ద్వారా అక్కడికక్కడే నిర్ధారించామన్నారు.
Sorry, no posts matched your criteria.