Telangana

News March 19, 2024

1.61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి బిల్డర్లకు కేటాయింపు, కలెక్టర్

image

కామారెడ్డి ,2022- 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని బిడ్డర్లకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల తో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత రబీకి సంబంధించి లక్ష 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి ప్రభుత్వం బిడ్డర్లను కేటాయించిందని అన్నారు.

News March 19, 2024

గుండెపోటుతో గద్వాల వాసి మృతి

image

గద్వాల పట్టణానికి చెందిన వ్యాపారవేత్త మాక ప్రవీణ్ కుమార్ మంగళవారం గుండెపోటుకు గురై హైదరాబాదులో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాలు.. వ్యాపారం నిమిత్తం భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో దుకాణంలో గుండెపోటుకు గురయ్యాడు. దుకాణదారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గద్వాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 19, 2024

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ గౌతం

image

ఎన్నికల నిర్వహణలో ఏ దశలోనూ లోపాలు లేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, ఏఆర్ఓ , డిఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా సజావుగా జరపాలన్నారు.

News March 19, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులపాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News March 19, 2024

నార్సింగి: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నార్సింగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయడం లేదు. దీంతో అతని భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో విరక్తి చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు.

News March 19, 2024

KTDM: లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

image

చర్ల సరిహద్దుకు ఆనుకుని ఉన్న సుకుమా జిల్లా కిస్టారం ఏరియా కమిటీకి చెందిన సోడి కొస, సోడి సుక్కి అనే మావోయిస్టు దంపతులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ గతంలో పలు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. సుక్కా అలియాస్ సోడి కోసపై రూ.5లక్షలు రివార్డు, సోడి సుక్కి మీద రూ.2 లక్షలు రివార్డు ఉంది.

News March 19, 2024

HYD: కాంగ్రెస్‌లోకి నలుగురు BRS ఎమ్మెల్యేలు..?

image

కాంగ్రెస్‌లోకి HYD BRS నేతలు చేరుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో నలుగురు MLAలే ఉన్నట్లు టాక్. ఇప్పటికే MP రంజిత్ రెడ్డి, MLA దానం, బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కరిద్దరు MLAలు సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. MP ఎన్నికల వేళ పార్టీ మార్పుల అంశం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.

News March 19, 2024

HYD: కాంగ్రెస్‌లోకి నలుగురు BRS ఎమ్మెల్యేలు..?

image

కాంగ్రెస్‌లోకి HYD BRS నేతలు చేరుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో నలుగురు MLAలే ఉన్నట్లు టాక్. ఇప్పటికే MP రంజిత్ రెడ్డి, MLA దానం, బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కరిద్దరు MLAలు సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. MP ఎన్నికల వేళ పార్టీ మార్పుల అంశం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.

News March 19, 2024

ఆదిలాబాద్: ఈనెల 21 నుంచి బీఈడీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్ ,ఇంప్రూవ్మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్ నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక తెలిపారు. ఈనెల 21, 23, 26, 28, 30, ఏప్రిల్ 1న పరీక్షలు ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

News March 19, 2024

MBNR: పార్టీల బలాబలాలు తారుమారు.. !

image

MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల బలాబలాలు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1439 ఓట్లు ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు 800 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పలువురు ఎంపీటీసీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని జిల్లాలో చర్చ సాగుతోంది.