India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బుధవారం ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక(14) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాలో బంధువుల వద్ద ఉంటూ, పనికి వెళ్తుంది. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి బాలిక కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు వెతకగా చెట్టుకు ఉరేసుకుని కనిపించిందని బాలిక తండ్రి దేవయ్య తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ ఘటన రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటుచేసుకుంది. KNR నుంచి గంగాధరకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న రాజయ్యకు ఫిట్స్ వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతిచెందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో స్పౌజ్ విభాగంలో ప్రత్యేక పాయింట్లు పొందిన వారి వివరాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఈవోలు స్పౌజ్ బదిలీలను పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలు ఉంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.

బల్దియా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న షాహిన్ బేగం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అర్హత పొందిన నామినేషన్ల వివరాలు 23న వెలువరిస్తారు. ఉపసంహరణ గడుపు 26వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

బల్దియా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న షాహిన్ బేగం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అర్హత పొందిన నామినేషన్ల వివరాలు 23న వెలువరిస్తారు. ఉపసంహరణ గడుపు 26వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెలలో ప్రారంభం కానున్న హెచ్సీఏ బీ1 డివిజన్ 2-డే లీగ్‌లో పాల్గొనేందుకు అండర్-25 ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఎంపిక చేయనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి లోని జూబ్లీక్లబ్ ప్రాంగణంలోని ఎంఎస్ అకాడమీలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని దంత వైద్య విభాగంలో మొట్ట మొదటిసారిగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను నిర్వహించారు. వ్యక్తికి సంబంధించి ముఖంలోని ఆరు దవడ ఎముకలు విరిగిపోవడంతో దంత వైద్య నిపుణులు 6 మినీ ప్లేట్లు, 20 స్క్రూలు బిగించి ఆపరేషన్ విజయవంతం చేశారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ అభినందించారు.

బీర్కూరు మండలం బరంగేడ్గి గ్రామంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమూర్తి(36) వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల నూతన గృహాన్ని అప్పులు చేసి నిర్మించారు. అప్పులు ఇచ్చినవారు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు పారిపోగా పోలీసులు వీరిని హైదరాబాదులో గుర్తించారు. జైపూర్ KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు బుధవారం ఉదయం 3 గంటలకు పారిపోయారని అధికారిణీ శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈమేరకు దర్యాప్తు ప్రారంభించి CC కెమెరాలను పరిశీలించి భాగ్యనగర్ రైల్లో హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించామని శ్రీరాంపూర్ CI. మోహన్, SI.రాములు తెలిపారు.
Sorry, no posts matched your criteria.