Telangana

News August 26, 2024

HYD: రాష్ట్ర స్పీకర్ X అకౌంట్ హ్యాక్..!

image

తెలంగాణ రాష్ట్ర స్పీకర్, VKB అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ (X) హ్యాండిల్ హాక్ అయింది. దీనిపై స్పీకర్ స్పందిస్తూ..మీకు ఎలాంటి సందేశాలు వచ్చినా, వ్యంగ్యమైన పోస్టులు షేర్ చేసినా మీరు ఎవ్వరు పట్టించుకోకండి.
నేను నా X టెక్నికల్ టీంతో మాట్లాడి తిరిగి అకౌంట్ రికవరీ చేయించాను. ఇకపై యథావిధిగా ఎక్స్ అకౌంట్లో మా అప్డేట్స్ చూడగలరు అని స్పీకర్ అన్నారు.

News August 26, 2024

గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహుల ఎదురుచూపు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియగా, నాటి నుంచి గ్రామ సచివాలయాల పరిపాలన ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళింది. లోకసభ ఎన్నికలు పూర్తికాగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అందరూ ఊహించారు. అయితే బిసి జనాభా బీసీ గణన పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహిస్తారని సంకేతాలు రావడంతో ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. 

News August 26, 2024

HYD: తండ్రి ముందే కూతురు మృతి

image

తండ్రి ముందే కూతురు మృతి చెందిన విషాదఘటన హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరుకు చెందిన SPF SI శంకర్ రావు తన కుతూరిని బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వారి బైక్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

HYD: తండ్రి ముందే కూతురు మృతి

image

తండ్రి ముందే కూతురు మృతి చెందిన విషాదఘటన హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరుకు చెందిన SPF SI శంకర్ రావు తన కుతూరిని బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వారి బైక్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

సంగారెడ్డి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం

image

ప్రధానమంత్రి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న ప్రతిభావంతులు అర్హులని చెప్పారు. పిల్లల రక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31లోగా http@awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 26, 2024

కరీంనగర్: పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు

image

జగిత్యాల-వరంగల్ ఎన్‌హెచ్ 563 రహదారి నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేసిన అధికారులు రైతులకు నష్టపరిహారం ఇంకా అందించలేదు. గత రెండు సంవత్సరాల క్రితం రహదారి పనులు ప్రారంభం కాగా భూ సేకరణ చేసిన అధికారులు రైతుల ఖాతాలోకి జమ కాలేదు. కొందరి బావులు ఈ రహదారి కింద పోతుండగా ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం చెల్లిస్తే ముందస్తుగా మళ్లీ బావులను తవ్వుకుంటామని, వెంటనే నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

News August 26, 2024

MBNR: వార్డుల వారీగా ఓటరు జాబితా !

image

పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులు గ్రామపంచాయతీ వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదాను గ్రామపంచాయతీలలో అందుబాటులో ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని, పంచాయతీ ఓటరు జాబితాను తయారుచేశారు. అయితే తుది జాబితాను సెప్టెంబర్ 21న ప్రచురించనున్నారు.

News August 26, 2024

NRPT: ప్రేమ పేరుతో యువతికి మోసం

image

యువతిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భం దాల్చాక మొహం చాటేసిన యువకుడిపై కేసు నమోదు అయింది. SI కృష్ణంరాజు వివరాలు.. ఊట్కూరు మం. కొల్లూరుకు చెందిన యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. ఆమె గర్భవతి కాగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News August 26, 2024

MDK: ప్రియురాలికి పెళ్లి నిశ్చయం.. ప్రియుడు సూసైడ్

image

మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ప్రేమించిన యువతకి పెళ్లి నిశ్చయమైందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. బండారు చందుబాబు(25) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోక పోగా ఆమెకు మరో యువకుడుతో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన చందు ఈనెల 13న విషం తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

News August 26, 2024

అంజన్న భక్తులకు భారం కానున్న పార్కింగ్

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థాన కొండపైన వాహనాల పార్కింగ్ రుసుము వసూలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. బస్సు, లారీ రూ.50, కారు, జీపు రూ.40, ఆటోకు రూ.30, బైక్‌ రూ.10 వాహన రుసుముగా అధికారులు నిర్ణయించారు. పార్కింగ్‌కు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలపకుండానే పార్కింగ్ రుసుము ప్రవేశ పెట్టడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.