India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కోటాలగడ్డ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్ధానికులు వివరాల ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు స్ధానికులు తెలిపారు. ఈ ఘటన సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు రాయడానికి హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా రాయాలన్నారు.
కొల్చారం మం. కిష్టాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వస్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 రైతులకు చెందిన 20,071 ఎకరాల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు కొంతమేర గోధుమ, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు. కాబట్టి వాహనదారులను ఎవరైనా విద్యార్థులు లిఫ్ట్ అడిగితే దయచేసి వారికి లిఫ్ట్ ఇచ్చి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరేందుకు సహకరించండి. >>>SHARE IT
గంగాధర మండలం గట్టు బూత్కూర్ గ్రామానికి చెందిన బొమ్మరవేణి దశరథం (40) అనే వ్యక్తి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాలమూరు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని నారాయణపేట జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో జరిగిన ప్రధాని మోదీ విజయ సంకల్ప సభ దిగ్విజయం కావడమే అందుకు నిదర్శనమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో మునిగి పోయిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కానీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 600 మంది యువకులు ఆదివారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ… పార్టీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని సూచించారు. ఈ దేశం యువత భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు.
మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ములుగు జిల్లాలో రేపు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ షాపులను సైతం మూసివేయాలని కోరారు. కాగా జిల్లాలో 3,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Sorry, no posts matched your criteria.