Telangana

News August 26, 2024

HYD: ట్రాఫిక్ చలాన్లు పెరగనున్నాయి?

image

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత చలాన్లపై 5,6 రెట్లు పెంచి పలు నిబంధనల్లో పలు మార్పులు చేసేందుకు యోచిస్తోంది. ఇష్టారీతిన వాహనాలు నడిపేవారికి ముక్కు తాడు వేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ 18,33,761 మందికి జరిమానాలు విధించారు.

News August 26, 2024

HYD: ప్రతీ స్కూల్ నుంచి 5మందికి గొప్ప అవకాశం

image

HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్‌స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 26, 2024

జిల్లాలో పీఎం మాన్-ధన్ యోజనకు ఆదరణ కరువు

image

కరీంనగర్: ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజనకు కరీంనగర్ జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అన్నదాతలకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది రైతులు అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు వెయ్యి మంది మాత్రమే ఇందులో చేరారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించ కపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

News August 26, 2024

HYD: ప్రతీ స్కూల్ నుంచి 5మందికి గొప్ప అవకాశం

image

HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్‌స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 26, 2024

MBNR: GHMల భర్తీ.. విద్యాశాఖ ఫోకస్

image

ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 52 జీహెచ్ఎం పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. SAలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సీనియార్టీ జాబితాలతో పాటు ఖాళీల వివరాలను అధికారులు ప్రకటించారు. వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, రెండు రోజుల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

News August 26, 2024

హైడ్రా విషయంలో పేద ప్రజల జోలికి వెళ్లొద్దు: కూనంనేని

image

హైదరాబాదులో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన “హైడ్రా” మంచిదేనని, అయితే పేద ప్రజల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించాలన్నారు. ఆ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలన్నారు.

News August 26, 2024

NLG: కలవరపెడుతున్న సాగర్ డ్యాం లీకేజీలు

image

సాగర్ డ్యాం లీకేజీలు కలవరపెడుతున్నాయి. డ్యాం నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్లో కొన్ని బ్లాకుల నుంచి నీటి ఊట వస్తోంది. ప్రధాన డ్యాంలో 1 నుంచి 23వ బ్లాకు వరకు ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్ ఉండగా 24 నుంచి 50వ బ్లాకు వరకు 26 రేడియల్ క్రస్ట్ గేట్లు అమరి ఉన్న ఓవర్ ఫ్లో సెక్షన్ ఉంది. స్పిల్ వేకు కుడివైపు 51 నుంచి 76 వరకు బ్లాకులు ఉన్నాయి. జలాశయంలో గరిష్ట నీటిమట్టం వచ్చినప్పుడల్లా డ్యాం నుంచి నీరు తీకవుతోంది. 

News August 26, 2024

అర్హులందరికీ రుణమాఫీ: వ్యసాయ అధికారి

image

ఉమ్మడి జిల్లాలో పంట రుణమాఫీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. మెదక్ జిల్లాలో మొత్తం 81,801 మంది రైతులకు రూ.599.14 కోట్లు జమ చేసింది. అయితే తమకు మాఫీ కాలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 5657 ఫిర్యాదు రాగా.. అత్యధికంగా కొల్చారం మండలం నుంచి ఉన్నాయి. రుణమాఫీ కానీ రైతులంతా AOలకు ఫిర్యాదు చేయాలని, అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా చూస్తామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తెలిపారు.

News August 26, 2024

BHPL: పెరిగిన ప్రాణహిత వరద ప్రవాహం

image

కాళేశ్వరం వద్ద మళ్లీ ఉభయ నదుల ప్రవాహం పెరిగింది. ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలిసి వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. 7.8 మీటర్ల మేర నీటిమట్టం నమోదైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల నదికి వరద ఉధృతి పెరిగిందని అధికారులు అన్నారు.

News August 26, 2024

NH-161 పై ప్రమాదం.. కామారెడ్డి వాసి మృతి

image

సంగారెడ్డి జిల్లా నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన శ్రీనివాస్(27), సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.