Telangana

News August 26, 2024

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్పులు

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేక మార్పులు జరగనున్నాయి. కొత్తగా మధిర డివిజన్‌ ఏర్పాటుతో పాటు పలు స్టేషన్ల డివిజన్లను మార్చనున్నారు. ఖమ్మం గ్రామీణంలోని పెద్దతండా పంచాయతీ కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదనకు రంగం సిద్ధమైంది. దీనికి అనుగుణంగా ఎం. వెంకటాయపాలెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో ఇన్ స్పెక్టర్ స్థాయి కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

News August 26, 2024

MBNR: లింక్ క్లిక్ చేస్తే.. రూ.95 వేలు మాయం

image

ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌పై క్లిక్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు డ్రా అయిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. CI ఆదిరెడ్డి తెలిపిన వివరాలు.. స్థానిక భవానీనగర్‌కు చెందిన కౌసల్య వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను పిల్లలు క్లిక్ చేశారు. ఆ వెంటనే ఖాతాలో ఉన్న రూ.95,800ను సైబర్ కేటుగాళ్లు కాజేశారు. బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు.

News August 26, 2024

ADB: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముంబాయి-బల్లార్ష మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ 28, 29 తేదీల్లో ఆదిలాబాద్ వరకే పరిమితం కానుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నాగపూర్ డివిజన్లో మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. 28న సీఎస్ ముంబయి నుంచి బయలుదేరే రైలు(నెంబరు 11401) ఆదిలాబాద్లో నిలిపివేయునున్నట్లు పేర్కొంది. 29న నందిగ్రామ్ రైలు(నెంబరు 11402) ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ముంబయికి బయలుదేరనుంది.

News August 26, 2024

NZB: నిజామాబాద్‌లో మాంసం విక్రయాలు బంద్

image

నేడు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా నిజామాబాద్‌లో మాంసం విక్రయాలు నిర్వహించవద్దని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని చేపలు, మేకల మాంసం విక్రయాలు, చికెన్ సెంటర్లు, ఇతర మాంసాహార దుకాణాల నిర్వాహకులు ఈ విషయం గమనించాలన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. ఈ ఉత్తర్వును తూ.చా తప్పక పాటించాలన్నారు.

News August 26, 2024

ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్: పొంగులేటి సుధాకర్ రెడ్డి

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గ్లోబల్ లీడర్ అని ఆయన అవలంభిస్తున్న విధానాల పట్ల అగ్ర దేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఓ హోటల్లో ఆదివారం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ హాజరయ్యారు.

News August 26, 2024

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

నల్గొండ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ తెలిపారు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా సెలవు రోజు కావడంతో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదు దారులు గమనించి సెప్టెంబర్ 1న జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

News August 26, 2024

రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

image

రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత భవనాలను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ & స్టాంపింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. రెండేళ్లలో శాశ్వత భవనాలలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు.

News August 26, 2024

నేడు ప్రజావాణి కార్యక్రమం లేదు: జిల్లా కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి ఎవరూ రావొద్దని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

News August 26, 2024

రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: DK అరుణ

image

క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు -2024 కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో అంకితభావంతో పనిచేసి ఒక్క కార్యకర్త 100 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలతో మమేకమై స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.