Telangana

News August 26, 2024

రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: DK అరుణ

image

క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు -2024 కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో అంకితభావంతో పనిచేసి ఒక్క కార్యకర్త 100 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలతో మమేకమై స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.

News August 26, 2024

ఆదిలాబాద్: ‘రిమ్స్‌లో నాణ్యమైన చికిత్సను అందించాలి’

image

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సను అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులతో వారు మాట్లాడారు. రోగులకు చికిత్సతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు.

News August 26, 2024

ములుగు: గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 27, 28న ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ దివాకర టిఎస్ పరిశీలించారు. పాలంపేటలోని రామప్ప దేవాలయం, లక్నవరం లేక్, హరిత కాటేజ్‌ల సుందరీకరణ పనులను పరిశీలించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News August 26, 2024

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం: డీకే అరుణ

image

సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషిస్తే రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని MBNR ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఇవాళ నిర్వహించిన కార్యశాల సమావేశంలో అరుణ పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు అంకితభావంతో నిర్వహించాలని ఎక్కువ మంది యువకులకు పార్టీ సభ్యత్వం ఇప్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

News August 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడలో జరిగిన మెగా జాబ్ మేళ. @ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా. @ ధర్మారం మండలంలో జ్వరంతో యువకుడి మృతి. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. @ ధర్మపురి మండలంలో మహిళ ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్. @ జగిత్యాల జిల్లాలో 204 డెంగ్యూ కేసులు.

News August 25, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తాం:సీఎం
✓VKB: చాకచక్యంగా రైలు ప్రమాదాన్ని తప్పించుకున్న మహిళ
✓HYD నగరానికి 74KM దూరంలో చారిత్రాత్మక కొండాపూర్
✓గుడిమల్కాపూర్: లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి
✓గచ్చిబౌలి: అమ్మాయిలను రేప్ చేసిన ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
✓డెంగ్యూ కేసుల పై హరీష్ రావు ఆందోళన
✓ఉప్పల్: 2.20 కిలోల గంజాయి సీజ్

News August 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> MLG: బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
> HNK: జిల్లాలో బీసీ శంఖారావం సదస్సు
> WGL: ‘హైడ్రా’ లాగా.. వరంగల్లో ‘వాడ్రా’!
> JN: బోనమేత్తిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
> HNK: కొత్తిమీర కిలో @200 రూపాయలు
> WGL: కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని
> HNK: తీజ్ ఉత్సవాల్లో పాల్గొని నృత్యం చేసిన ఎంపీ కడియం కావ్య
> BHPL: చిత్రకళలో రాణిస్తున్న చిన్నారి ఆద్య

News August 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✒అలంపూర్: కరెంట్ స్తంభం విరిగి పడి బాలుడి మృతి
✒కొత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి
✒కల్వకుర్తి బస్టాండ్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి
✒MBNR: గుండెపోటుతో బీజేపీ కార్యకర్త మృతి
✒రేపు వర్షాలు.. పాలమూరు జిల్లాకు ఎల్లో అలర్ట్
✒గండీడ్: దారుణం.. కన్న తల్లిని కొట్టి చంపిన కొడుకు
✒ఒక్కేషనల్ కోర్సులు.. దరఖాస్తుల ఆహ్వానం
✒అటహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నీ

News August 25, 2024

హైరిస్క్ జాబితాలో వనపర్తి, మహబూబ్‌నగర్

image

ఉమ్మడి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లాల్లోని ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. మూడు జిల్లా పరిధిలో 75 చికున్‌గున్యా కేసు నమోదు కాగా.. వనపర్తి, MBNR జిల్లాలు చికున్‌గున్యా హైరిస్క్‌లో ఉన్న జిల్లాల జాబితాలో ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది సేవలు విస్తృతంగా పెంచాలని, పరీక్షలు చేయాలని సూచించింది. వ్యాధుల కట్టడిలో వైద్యశాఖ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.

News August 25, 2024

సంగారెడ్డి: ‘కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి’

image

కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్ లో తోషిబా పరిశ్రమ కార్మికుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తోషిబా పరిశ్రమలో అవకాశ వాదులను ఓడించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు రాజయ్య పాల్గొన్నారు.