Telangana

News August 25, 2024

అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

image

అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్‌లో పడి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన తాప్సీ ప్రవీణ్ అమెరికాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడి చనిపోయాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు పాతర్ల పహాడ్‌లో నివాసముంటున్నారు.

News August 25, 2024

సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి: మంత్రి సురేఖ

image

జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయమని మంత్రి చెప్పారు.

News August 25, 2024

ఖమ్మం: గోల్డ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ దంపతులు

image

 HYDలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్ఎండీసీ మారథాన్లో మద్దులపల్లికి చెందిన కానిస్టేబుళ్లు రేగళ్ల గోపీ, బీరెల్లి లక్ష్మీ దంపతులు గోల్డ్ మెడల్ సాధించారు. గోపీ 42.2 కిలోమీటర్ల పరుగు పందెంలో 4.17 ని.ల్లో విజయం సాధించగా, లక్ష్మీ 21.1 కి.మీ రేంజ్లో 2.38 ని.ల సమయంలో గమ్యం చేరుకుని విజయం సాధించారు. గోపీ గన్ మెన్‌గా, లక్ష్మీ తిరుమలాయపాలెం PSలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నారు.

News August 25, 2024

సంగారెడ్డి: వండర్ బుక్ ఆఫ్ రికార్డులో కూచిపూడి నృత్య ప్రదర్శన

image

వాసవి మా ఇల్లు, నటరాజ స్ఫూర్తి డాన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 131 మంది నృత్య కళాకారులు 9.5 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ నాగేందర్ గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ సర్టిఫికెట్ నిర్వాహకులకు అందించారు.

News August 25, 2024

UPDATE: ఖేడ్.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నారాయణఖేడ్ మండలం నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం నేరంగల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(27) ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.

News August 25, 2024

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి: ఈటల

image

వివిధ డిపార్ట్మెంట్లలో నాలుగు నెలలకు ఆరు నెలలకు గ్రాంట్ రూపంలో జీతాలు ఇస్తే పేద ఉద్యోగుల జీవనం ఎలా సాగుతుందని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఈ మధ్యవర్తుల దోపిడి ఉండకూడదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే జీతాలు చెల్లిస్తున్నారో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అలానే ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు.

News August 25, 2024

బోనాల వేడుకల్లో డోలి వాయించిన ఎమ్మెల్యే కుంభం

image

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో సాంప్రదాయ బద్దంగా డోలు వాయించి ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నారు. వలిగొండ ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో వచ్చి గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పించారు.

News August 25, 2024

HYD నగరానికి పూర్వవైభవం తీసుకొస్తాం: సీఎం

image

జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు.

News August 25, 2024

జగదేవ్పూర్: తల్లిదండ్రుల సూసైడ్.. అనాథలైన చిన్నారులు

image

జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన శేఖర్, సౌమ్య దంపతులు నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మృతితో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. చిన్నారులకు గజ్వేల్ మనం ఫౌండేషన్ సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. అధ్యక్షుడు స్వామి, సభ్యులు కనకయ్య, ఆంజనేయులు వారికి రూ.10వేలు అందజేసి మానవత్వం చాటుకున్నారు. పిల్లలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలాలని కోరారు.

News August 25, 2024

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్‌లో భారీ కుంభకోణం

image

ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఖమ్మం జిల్లాల్లో పక్కదారి పట్టినట్లు సీఐడీ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నెల 23న ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు.