Telangana

News August 25, 2024

HYD నగరానికి పూర్వవైభవం తీసుకొస్తాం: సీఎం

image

జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు.

News August 25, 2024

రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

image

రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26న ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇస్కాన్ టెంపుల్, అబిడ్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

News August 25, 2024

రావి ఆకులపై చిన్ని కృష్ణుడి చిత్రాలు

image

సంగారెడ్డి జిల్లా అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ఆదివారం రావి ఆకులపై విభిన్న రూపాల్లో నంద గోపాలుడి చిత్రాలు గీసి అబ్బురపరిచారు. ఆకులపై రూపొందించిన మురళీ కృష్ణుడి చిత్రాలు సోషల్ మీడియాలో వైరలై, ఆర్టిస్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 26, 27న శ్రీకృష్ణ జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

News August 25, 2024

కొత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి

image

కొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం తల్లీకూతురు మృతిచెందాడు. హైవేపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కొత్తూరు వైపు నుంచి వస్తున్న లారీ టెంపోను ఢీకొట్టింది, ఆ టెంపో వెళ్లి ఆటోను ఢీ కొట్టింది. ఆటో, బైక్ ను ఢీకొట్టడంతో వాహనంపై వెళ్తున్న తల్లీకూతురు ఎగిరి రోడ్డుపై పడి మృతి చెందినట్లు తెలిసింది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 25, 2024

MBNR: ప్రిన్సిపల్స్ సంఘం విస్తృత స్థాయి సమావేశం

image

MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కళింగ కృష్ణ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రిన్సిపల్స్ రమేష్ లింగం, మద్దిలేటి, మాధవరావు, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News August 25, 2024

NZB: ఆహారంలో బొద్దింక.. రూ. 5 వేల జరిమానా

image

నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న వ్యక్తి ఆహారంలో బొద్దింక వచ్చింది. దీంతో ఈ విషయాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్‌కి బాధితుడు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందిని హోటల్‌కి పంపించాడు. ఆహారంలో బొద్దింక ఉందని వారు నిర్ధారించడంతో ఆయన హోటల్ యాజమాన్యానికి నోటీస్‌తో పాటు రూ.5వేలు జరిమానా విధించారు.

News August 25, 2024

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ అసదుద్దీన్ భేటీ

image

సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ ఖలీద్ సైపుల్ల రెహమాని, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హకీం ఖురేషి, పాల్గొన్నారు.

News August 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కల్లూరులో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మొగల్మట్కాలో 6.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా ఘన్పూర్ లో 1.0 మిల్లీమీటర్లు, గద్వాలలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 25, 2024

హైడ్రా లాగా.. కరీంనగర్‌లో కాడ్రా ఏర్పాటుకు కృషి: వెలిచాల

image

హైడ్రా లాగా కరీంనగర్‌లో కాడ్రా ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో కృషి చేస్తానని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో యథేచ్ఛగా భూములు కబ్జా అయ్యాయని, పేదలను జలగల లాగా పట్టి పీడించుకుతిన్నారన్నారు. దుర్మార్గపు ఆలోచన రాకుండా ప్రభుత్వ భూములపై సీఎం దృష్టికి తీసుకెళ్లి రక్షించి కాడ్రా ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.

News August 25, 2024

సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరి మృతి

image

సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. జింకలగూడెం సీతారాం ప్రాజెక్టు కాలువలో ఇద్దరు గల్లంతయ్యారని సమాచారం అందుకున్న ఎస్సై రాజేశ్ గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు ప్రమాదవశాత్తు పడిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.